డీ గ్లామర్ లుక్ లో షాక్ ఇవ్వనున్న సామ్..!

0

దక్షిణాది స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సక్సెస్ ఫుల్ సిరీస్ కి కొనసాగింపుగా సీజన్ 2 ని రూపొందించారు. సెకండ్ సీజన్ లో సమంత కీలక పాత్రలో కనిపిస్తున్నారు. మనోజ్ బాయ్ పాయ్ – ప్రియమణి లు ఈ సీజన్ లో కూడా కొనసాగుతున్నారు. రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ మంచి ఆదరణ దక్కించుకోవడంతో సీజన్ 2 పై మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తుండటంతో ఈ సిరీస్ పై ఆసక్తి రెట్టింపు అయింది.

కాగా ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ లో సమంత నెగెటివ్ రోల్ లో పాకిస్తానీ టెర్రరిస్ట్ పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె డీ గ్లామర్ లుక్ లో అందరిని షాక్ కి గురి చేస్తుందట. ఇప్పటికే విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఏడాది సెలబ్రేషన్స్ వీడియోలో సామ్ క్యారక్టర్ గురించి హింట్ ఇచ్చారు. సమంత బ్యాక్ సైడ్ లుక్ ని అందులో రివీల్ చేశారు. ప్యాంటు షర్ట్ ధరించిన సామ్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపించింది. ఇక ఈ సిరీస్ లో సమంత అద్భుతంగా నటించిందని.. ఆమె పాత్ర చూసి ప్రేక్షకులు షాక్ అవుతారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ తో సమంత నేషనల్ వైడ్ పాపులర్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.