Templates by BIGtheme NET
Home >> Cinema News >> దీపికా వెల్లడించిన ‘A’ ‘S’ ‘R’ అంటే ఆ హీరోలేనా…?

దీపికా వెల్లడించిన ‘A’ ‘S’ ‘R’ అంటే ఆ హీరోలేనా…?


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో రోజులు గడిచే కొద్దీ అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో అనూహ్యంగా బయటకు వచ్చిన డ్రగ్స్ కోణంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తితో పాటు పలువురిని ఎన్సీబీ అరెస్ట్ చేసి విచారిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల స్టార్ హీరోయిన్లు దీపిక పదుకొనే – సారా అలీఖాన్ – రకుల్ ప్రీత్ సింగ్ – శ్రద్ధా కపూర్ లను విచారించారు. ఈ నేపథ్యంలో ఎన్సీబీ అధికారులు డ్రగ్స్ రాకెట్ తో లింకులు ఉన్న బాలీవుడ్ స్టార్స్ ని గుర్తించినట్లు తెలుస్తోంది. త్వరలోనే డ్రగ్స్ కేసులో మరికొందరు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసి విచారించనుందని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో దీపిక పదుకొనే ముగ్గురు బాలీవుడ్ స్టార్స్ పేర్లు వెల్లడించిందని జోరుగా ప్రచారం సాగుతోంది. దీపికా చెప్పిన పేర్లు ‘ఏ’ ‘ఎస్’ ‘ఆర్’ అనే లెటర్స్ తో స్టార్ట్ అవుతాయని.. వారు ఆమెతో కలిసి నటించిన వారేనని.. త్వరలో ఆ ముగ్గురు హీరోలకు సమన్లు జారీ చేసేందుకు ఎన్సీబీ అధికారులు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ ముగ్గురు ఎవరనేది బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వాటిని డీ కోడ్ చేస్తూ ‘ఎస్’ అంటే షారుక్ ఖాన్ అని.. ‘ఏ’ అంటే అర్జున్ రాంపాల్ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వీరిద్దరూ దీపికా తో నటించిన వారే అవడం గమనార్హం. అయితే ‘ఆర్’ అంటే ఎవరనే చర్చ కూడా జరుగుతోంది.

ఇదిలా ఉండగా ఇటీవల హీరోయిన్ షెర్లిన్ చోప్రా గతంలో ఒకసారి కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ నిర్వహించే పార్టీలో డ్రగ్స్ వాడడాన్ని చూశానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్ టీమ్ కి షారుక్ ఓనర్ అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షారుక్ ని విచారిస్తారేమో అని బీ టౌన్ వర్గాల్లో అనుకుంటున్నారు. దీనికి తోడు దర్శక నిర్మాత కరణ్ జోహార్ జోహార్ ఇంట్లో జరిగిన పార్టీపై ద్రుష్టి పెట్టిన ఎన్సీబీ.. త్వరలోనే వారిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. ఏదేమైనా బాలీవుడ్ లో దుమారం రేపుతున్న డ్రగ్స్ వ్యవహారం కారణంగా ఇండస్ట్రీలో డ్రగ్స్ అనేవి సర్వసాధారణం అనే విధంగా ఆలోచించే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి రానున్న రోజుల్లో డ్రగ్స్ మాఫియాలో ఎంతమంది సినీ ప్రముఖుల పేర్లు తెరపైకి వస్తాయో చూడాలి.