బెడ్ రూమ్ సీన్లకు కాజల్ అంగీకరిస్తుందా?

0

సమంత.. రాధికా ఆప్టే.. తమన్నా.. శ్రుతిహాసన్.. వీళ్లంతా డిజిటల్ వేదికపై రోజురోజుకి బిజీ అయిపోతున్నారు. ప్రియాంక చోప్రా.. కంగన రనౌత్ లాంటి స్టార్లు డిజిటల్ మార్కెట్ పై కన్నేసి జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రయత్నాలతో వేడెక్కించేస్తున్నారు.

ఇప్పుడు ఇదే బాటలో చందమామ కాజల్ కూడా ఓ అంతర్జాతీయ ఓటీటీ సిరీస్ లో నటించనుందని తెలుస్తోంది. వెబ్ సిరీస్ అంటేనే అందాల విందు. కాజల్ ఇక ఎలాంటి మొహమాటం లేకుండా వెబ్ సిరీస్ లలో అందాలు ఆరబోయనుందట. అందుకు ఇప్పటికే ఓ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందని తెలుస్తోంది. అమెరికా కోడలు ప్రియాంక చోప్రా నటించిన బ్లాక్ బస్టర్ ఇంటర్నేషనల్ సిరీస్ క్వాంటికో తెలుగు సహా సౌత్ రీమేక్ లో కాజల్ నాయికగా నటించనుందని ప్రచారమవుతోంది.

ఇక క్వాంటికో సిరీస్ అంటే హీటెక్కించే సీన్లు ఎన్నో ఉన్నాయి. బెడ్ రూమ్ సన్నివేశాలు సహా బాత్రూమ్ సన్నివేశాలు కూడా ఇంతకుముందు హీటెక్కించాయి. అయితే వీటికి కాజల్ అంగీకరిస్తుందా? అన్నది అభిమానుల సందేహం. మరోవైపు చిరంజీవి సరసన ఆచార్య లాంటి క్రేజీ మూవీలో కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ సరసన భారతీయుడు 2లోనూ ఆడిపాడుతోంది.