దాసు ‘హిట్’ ను వదిలేశాడా?

0

ఫలక్ నుమా దాస్ సినిమాతో హీరోగా మాస్ ఆడియన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకున్న విశ్వక్ సేన్ ఆమద్య వచ్చిన హిట్ సినిమాతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలోని విశ్వక్ సేన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. వరుసగా సినిమాలను చేస్తున్న విశ్వక్ సేన్ ఆమద్య హిట్ సీక్వెల్ లో నటించే అవకాశం ఉన్నట్లుగా పేర్కొన్నాడు. నిర్మాత నాని మరియు దర్శకుడు శైలేష్ కొలను కూడా సీక్వెల్ విషయాన్ని ప్రకటించారు. కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది కాని ఇప్పటి వరకు సీక్వెల్ ప్రారంభం అయ్యేది.

ఎట్టకేలకు ‘హిట్’ సెకండ్ కేసుకు సంబంధించిన చర్చలు పూర్తి అయ్యాయి. నాని నిర్మాణంలోనే అదే దర్శకుడు హిట్ 2 ను తెరకెక్కించేందుకు సిద్దం అవుతున్నాడు. అయితే హీరో మాత్రం మారాడు. విశ్వక్ సేన్ పాత్రలో విలక్షణ నటుడు అడవి శేషు నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. విశ్వక్ సేన్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల శేషు ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతున్నాడా లేదంటే ఏమైనా విభేదాలు వీరి మద్య తలెత్తాయా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటీ అనేది మరికొన్ని రోజులకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.