ప్రేమగువ్వలు సరసాలతో ఫ్లిర్ట్ చేయడం మానరా?

0

ఈ జోడీ ప్రతిదీ ఓపెన్ గానే చేస్తారు. ఎవరికీ భయపడరు. దేనికీ వెరవరు. కామెంట్లకు బెదిరేదే లేదు. వ్యక్తిగత వ్యవహారాల్ని ప్రతిసారీ ఓపెనప్ చేసేయడం వీళ్లకే చెల్లింది. ఇప్పటికే పలుమార్లు సోషల్ మీడియా చాటింగుల్లో ఒకరితో ఒకరు సరసమాడుకున్న సన్నివేశం బయటపడింది. ఒకరి ఫోటోల్ని ఒకరు షేర్ చేస్తూ జంటగా ఉన్న ఫోటోల్ని రివీల్ చేస్తూ ఆటాడుకోవడం ఈ ప్రేమగువ్వలకు అలవాటు వ్యాపకం అన్న చర్చా సాగింది.

తాజాగా మరోసారి మలైకా – అర్జున్ మధ్య సరసం హాట్ టాపిక్ గా మారింది. ఈ జంట బాలీవుడ్ లోనే ఇప్పుడు ఆరాధ్య దంపతులు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న అర్జున్ (35) హిల్ స్టేషన్ నుండి తన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి.. మలైకాకు సూచనగా క్యాప్షన్ పెట్టాడు. “ఆమె మిమ్మల్ని చూస్తున్నప్పుడు …“ అని రాశాడు. ఇది ఉద్దేశపూర్వకంగా లైట్ తీస్కుని రాసిన వ్యాఖ్య. దీనికి మలైకా `ఎవరు?` అంటూ యథాలాపంగా రిప్లయ్ ఇచ్చేయగా.. అర్జున్ మరో వ్యాఖ్యతో వేడెక్కించాడు. టేక్ ఏ వైల్డ్ వైల్డ్ గెస్ ఫూల్.. అంటూ మలైకాతో చెప్పాడు. అర్జున్ -మలైకా వైల్డ్ సరసం నెటిజనుల్లో హాట్ టాపిక్ గా మారింది.

మలైకా అరోరా -అర్జున్ కపూర్ ఇటీవల హిమాచల్ ప్రదేశ్ – ధర్మశాలలో విహారయాత్రలో ఉన్నారు. అర్జున్ తన సహనటుడు సైఫ్ అలీ ఖాన్ తో కలిసి `భూత్ పోలీస్` షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు. మలైకా ధర్మశాలలో అర్జున్ తో చేరగా.. కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ తో కలిసి దీపావళి పండగను జరుపుకున్నారు. అర్జున్ ఈ పర్యటన కు అధికారిక ఫోటోగ్రాఫర్ గా మారి స్నాప్ లు బంధించారట. ఆ ఫోటోలన్నీ ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ గా మారాయి. ఇక ఇదే పనిలో అతడి ప్రేయసితో సరసం బయటపడింది.

గత ఏడాది పానిపట్ చిత్రంలో నటిస్తున్న అర్జున్ కి పుట్టినరోజు సందర్భంగా మలైకా అరోరా ఇన్ స్టా ద్వారా బర్త్ డే విషెస్ తెలిపారు. ఆమె తన పోస్ట్ లో అర్జున్ను “నా వెర్రి నాన్నా.. చాలా ఫన్నీ“ అంటూ వ్యాఖ్యానించడమే గాక.. అద్భుతమైన అర్జున్ అంటూ పొగిడేసింది. ముంబైలో తరచూ మలైకా అరోరాతో కలిసి అర్జున్ తన తల్లిగారైన మోనా నివశించే `జాయిస్ అరోరా నివాసం`లో కుటుంబ సమావేశాలకు వెళ్తాడు. అర్జున్ కపూర్ మలైకా కుమారుడు అర్హాన్ తో కూడా సరదాగా స్పెండ్ చేస్తుంటాడు. లంచ్ డిన్నర్ డేట్లు.. విందు విహారయాత్రలలో అర్హన్ తో కలుస్తుంటాడు.

పని విషయానికొస్తే మలైకా అరోరా ప్రస్తుతం డాన్స్ రియాలిటీ షో ఇండియాస్ బెస్ట్ డాన్సర్లో న్యాయమూర్తులలో ఒకరిగా కొరియోగ్రాఫర్స్ టెరెన్స్ లూయిస్ మరియు గీతా కపూర్లతో కలిసి ఉన్నారు. అర్జున్ కపూర్ రాబోయే సినిమాల్లో సందీప్ P ర్ పింకీ ఫరార్ మరియు భూట్ పోలీసులు ఉన్నారు.