Templates by BIGtheme NET
Home >> Cinema News >> పూర్తిగా హీరోయిన్ గా మారిన బిబి బ్యూటీ

పూర్తిగా హీరోయిన్ గా మారిన బిబి బ్యూటీ


తెలుగు బిగ్ బాస్ బ్యూటీ దివి హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకుంటుంది. ఉత్తరాది ముద్దుగుమ్మలకు పోటీగా అందాల ప్రదర్శణ చేయడంతో పాటు ఆకట్టుకునేలా ఫిజిక్ ఉంటేనే హీరోయిన్ గా రాణించే అవకాశం ఉంటుంది. తనలో ఉత్తరాది ముద్దుగుమ్మల రేంజ్ లో అందాల ఆస్తి ఉందని దివి మొదటి నుండి చూపిస్తూనే ఉంది. కాని అంతకు ముందు ఈమెను జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కాని బిబి లోకి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడికి ఆఫర్లు వస్తున్నాయి.

చిరంజీవి వేదాళం సినిమాలో ఆఫర్ దక్కించుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు కమిట్ అవుతుంది. మరో వైపు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటో షూట్ లు కూడా చేస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ ల మాదిరిగా ఈ అమ్మడు కూడా వరుసగా ఫొటో షూట్ లు చేస్తోంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఈ ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందాలను ఏ రేంజ్ లో చూపించాలో ఆ రేంజ్ లో ఆ యాంగిల్ లో చూపిస్తూ ఈ అమ్మడు ఇచ్చిన ఫొటో షూట్ చర్చనీయాంశం అయ్యింది. పూర్తిగా హీరోయిన్ గా మారిన బిబి బ్యూటీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ హీరోల సరసన నటించే ఫీచర్స్ ఉన్న ముద్దుగుమ్మ అంటూ దివిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.