ఇంకా బతికే ఉన్నాడు ప్లీజ్ అని వేడుకున్న హీరో

0

Drishyam Director Fighting For Survival With Ill Health

Drishyam Director Fighting For Survival With Ill Health

ప్రముఖ దర్శకుడు నిషికాంత్ మరణించారని వస్తున్న వార్తలను తాజాగా బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ఖండించారు. “ఆయన క్లిష్టమైన పరిస్థతిలోనే ఉన్నారు. మరణంతో పోరాడుతున్నాడు. కానీ అతను ఇంకా బతికే ఉన్నాడు“ అంటూ క్లారిటీనిచ్చారు. హైదరాబాద్ లో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న నిషికాంత్ ని రితేష్ సందర్శించారు. ఆయన కుటుంబీకుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రితేష్ సోషల్ మీడియాలో అతడి మరణంపై వస్తున్న వార్తల్ని ఖండించారు.

నిషికాంత్ ఇంతకుముందు అజయ్ దేవ్గన్-టబు నటించిన దృశ్యం చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇర్ఫాన్ ఖాన్ నటించిన మాదారీ .. జాన్ అబ్రహం నటించిన ఫోర్స్ .. రాకీ హ్యాండ్ సమ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

రితీష్ దేశ్ముఖ్ నటించిన `లై భారీ` అనే మరాఠా చిత్రానికి నిషికాంత్ దర్శకత్వం వహించారు. మరాఠాలో ఆయన తెరకెక్కించిన డెబ్యూ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దర్శకుడు నిషికాంత్ తో రితేష్ అనుబంధం అంతే ప్రత్యేకమైనది. నిషికాంత్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని.. ప్రాణాల కోసం పోరాడుతున్నారని తొలుత నిర్మాత మిలాప్ జావేరి ట్వీట్ చేశారు. అనంతరం ఆయన మరణ వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. దర్శకుడు నిషికాంత్ కామత్ కాలేయ సిరోసిస్ తో హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు.

“ఇప్పుడే ఆసుపత్రిలో నిషికాంత్ తో ఉన్న వారితో మాట్లాడాను. అతను ఇంకా కన్నుమూయలేదు. అవును క్రిటికల్ గా ఉంది. జీవన్మరణ పోరాటమిది. కానీ అతను ఇంకా బతికే ఉన్నాడు“ అంటూ రితేష్ ట్వీట్ చేయడంతో ప్రస్తుతానికి ఓ క్లారిటీ వచ్చింది.