మెగాస్టార్ కామన్ డీపీని రిలీజ్ చేయనున్న మెగాపవర్ స్టార్..!!

0

Megapower Star to release Megastar Common CDP

Megapower Star to release Megastar Common CDP

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంటరైనప్పటి నుండి అభిమానులలో సందడి నెలకొంది. మెగాస్టార్ ఇంతకాలం తన అభిమానులకు ఆడియో లాంచ్ లలో సినిమా వేడుకల్లో తప్ప ఎక్కడ కూడా కనిపించేవారు కాదు. కానీ ఇప్పుడు మెగాస్టార్ సోషల్ మీడియాలో కనిపించడం అభిమానులకు పెద్ద పండుగే అయిపోయింది. ప్రస్తుతం ఆయన ట్విట్టర్ వేదికగా ప్రతీ విషయం తన అభిమానులతో షేర్ చేస్తున్నారు. ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుండి అభిమానులతో తన కొత్త సినిమాల విషయాలు చెబుతున్నారు. మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు. కానీ అందరూ అనుకుంటున్నట్లే ఇంతవరకు ఈ సినిమా టైటిల్ పై క్లారిటీ ఇవ్వలేదు చిరు. గత కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. కానీ సోషల్ మీడియాలో అభిమానులు మాత్రం ఆచార్య సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేశారు.

సినిమా గురించి అప్డేట్స్ వచ్చినా రాకపోయినా నెట్టింట హల్చల్ చేస్తూనే ఉన్నారు. ఈరోజుల్లో ఏ హీరో అయినా కామన్ డీపీలతో పుట్టినరోజు నాడు ట్విట్టర్ వేదికగా హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త హీరో నుండి సీనియర్ హీరోల వరకు అందరూ అదే ప్రొసీడ్ అయిపోతున్నారు. అయితే ఆగష్టు 22న మెగాస్టార్ చిరు పుట్టినరోజు. ఈ సందర్బంగా ట్విట్టర్ లో ఈ మధ్య రికార్డుల గోల ట్రెండ్ అవుతోంది. అభిమానులు తమ హీరోల హ్యాష్ ట్యాగ్ లతో కామన్ డీపీలతో ట్వీట్ల వర్షం కురిపిస్తారు. అయితే ఈసారి మెగా ఫ్యాన్స్ ఓ రేంజిలో రచ్చ చేయడానికి ఫిక్స్ అయ్యారు. మొన్నటి వరకు కామన్ డీపీని ఓ ప్రముఖ సెలబ్రిటీ చేత లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే ఆ సెలబ్రిటీ ఎవరో కాదు. మెగా పవర్ స్టార్ రాంచరణ్. రాంచరణ్ ఆగష్టు 21న సాయంత్రం 6:03 గంటలకు మెగాస్టార్ 65వ బర్త్ డే కామన్ డీపీ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే మెగాస్టార్ పై ఓ స్పెషల్ సాంగ్ కూడా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆ సాంగ్ ఉందో లేదో తెలియాల్సి ఉంది.