Templates by BIGtheme NET
Home >> Cinema News >> గుప్తా ఈజ్ బ్యాక్ .. గ్యాప్ లో వస్తూనే బంతాడేసిందిగా..

గుప్తా ఈజ్ బ్యాక్ .. గ్యాప్ లో వస్తూనే బంతాడేసిందిగా..


నెటిజనులకు నేటి జనులకు గుప్తా మ్యాడమ్ పరిచయం అవసరం లేదు. సూపర్ హాట్ మోడల్ గా కథానాయికగాను ఇషా గుప్తా సుపరిచితం. వీటన్నిటినీ మించి మాజీ మిస్ గా అందాల పోటీల రారాణిగా .. టాప్ మోడల్స్ ని తీర్చిదిద్దే స్పెషలిస్ట్ ట్రైనర్ గా బహుముఖ ప్రజ్ఞతో ఆకట్టుకునే ఇషా గుప్తా ఒక ఫోటోషూట్ చేస్తే అది ఎంతగా వైరల్ అవుతుందో చెప్పాల్సిన పనే లేదు. కుర్రకారుకు మైండ్ బ్లాక్ అయ్యి మెంటలెక్కడం ఖాయం. స్టన్నింగ్ అప్పియరెన్స్ .. కిక్కిచ్చే బోల్డ్ యాటిట్యూడ్ ఈ అమ్మడితో పోటీపడడం ఇతర భామలకు అంత ఈజీ కానేకాదు. ఇదివరకూ బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో అదరగొట్టిన ఇషాజీ గత కొంతకాలంగా ఎందుకనో సైలెంటుగా ఉన్నారు. కానీ ఉన్నట్టుండి తాజాగా మరోసారి తనదైన శైలిలో చెలరేగి హెడ్ లైన్స్ లోకి వచ్చేశారు.

ఇషా గుప్తా నల్ల చొక్కా ధరించి బాటమ్ లెస్ లుక్ తో పిచ్చెక్కించిన వైనం ప్రస్తుతం యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె బ్లాక్ ఫ్రాక్ మోకాలి పొడవు సాక్స్ ధరించిన ఫోటో హీట్ పెంచింది. ఇషా గుప్తా ఇన్ స్టా లో 50లక్షలు పైగా అభిమానులను కలిగి ఉన్నారు అంటే ఇలాంటి టెక్నిక్ వల్లనే అన్నది చాలామంది అభిప్రాయం. తన అద్భుతమైన చిత్రాలతో డిజిటల్ లో మసాలా ట్రీట్ ఇవ్వడానికి అమితంగా ఇష్టపడుతుంది.

`జన్నత్ 2` తర్వాత పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన ఇషా గుప్తా రుస్తోమ్ -టోటల్ ధమాల్ -బాద్ షాహో లాంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించింది. ఆమె చివరిసారిగా `వన్ డే: జస్టిస్ డెలివర్డ్` లో కనిపించింది. ఇషా ప్రస్తుతం `హేరా ఫేరీ 3`లోనూ నటిస్తోంది. ఇషాజీ నటించిన దేశీ మ్యాజిక్ అనే చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉంది.