ప్రతీ క్షణం..నీ జ్ఞాపకాల్లోనే!

0

అతిలోక సుందరి.. ఆల్ ఇండియా స్టార్ హీరోయిన్ శ్రీదేవి చనిపోయి రెండు సంవత్సరాలు దాటి పోయినా కూడా ఇంకా ఆమె జ్ఞాపకాలు వదిలి పోలేదు. ఆమె అభిమానులు ఇంకా ఆమెను తల్చుకుంటూనే ఉన్నారు. అలాంటిది ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఎంతగా మిస్ అవుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఆమె బిడ్డలు అయిన జాన్వీ మరియు ఖుషిలు తల్లి లేని లోటును అనుభవిస్తూ ఉంటారు. నేడు శ్రీదేవి జయంతి. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో మరోసారి ఆమె మృతి గురించి ఆమె సినిమాల గురించి చర్చ జరుగుతోంది.

ఈ సందర్బంగా శ్రీదేవి భర్త బోణీ కపూర్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ఆయన ఎమోషనల్ అయ్యాడు. నీవు మమ్ములను విడిచి పెట్టి వెళ్లిన ఈ 900 రోజుల్లో ప్రతీ క్షణం నిన్ను మిస్ అవుతూనే ఉన్నాం. ఈ రోజు మరింత ఎక్కువగా నిన్ను మిస్ అవుతున్నాం. మన జాను గుంజన్ సక్సెనా సినిమా చూసి ఉంటే నీ మొహంలో ఆనందం కనిపించేది. నువ్వు మాతో పాటు ఉన్నావని ఆశిస్తున్నాం. హ్యాపీ బర్త్ డే మై లైఫ్ అంటూ ట్వీట్ చేశాడు.

జాన్వీ కపూర్ కూడా అమ్మ పాత ఫొటోను షేర్ చేసి అమ్మను గుర్తు తెచ్చుకుంది. ఈమె తాజాగా నటించిన గుంజన్ సక్సెనా చిత్రం తాజాగా విడుదల అయ్యింది. సినిమాకు మంచి టాక్ వచ్చింది. సినిమాలో ఆమె పాత్రకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇది శ్రీదేవి జయంతి కానుకగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.