‘గమనం’ కోసం పవన్ తో సహా ఐదుగురు స్టార్స్

0

శ్రియ శరన్.. నిత్యామీనన్.. ప్రియాంక జవాల్కర్ ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్న ‘గమనం’ సినిమా ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మొత్తం అయిదు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. విలక్షణమైన సినిమాగా సుజన రావు దర్శకత్వంలో గమనం రూపొందుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు మరియు సినిమాకు సంబంధించిన విషయాలు అంచనాలు పెంచాయి. ఇక రేపు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ట్రైలర్ విడుదల కాబోతుంది.

మొత్తం అయిదు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. కనుక ట్రైలర్ ను కూడా అయిదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. అయిదు భాషల్లో కూడా అయిదుగురు స్టార్స్ తో విడుదల చేయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు ట్రైలర్ ను పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేయించబోతున్నారు. ఆ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక హిందీ వర్షన్ ట్రైలర్ ను సోనూసూద్.. తమిళ వర్షన్ ట్రైలర్ ను జయం రవి.. కన్నడ వర్షన్ ను శివరాజ్ కుమార్ మరియు మలయాళ వర్షన్ ట్రైలర్ ను ఫహద్ ఫసిల్ లు సోషల్ మీడియా ద్వారా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అయ్యేది రేపటి ట్రైలర్ లో ప్రకటించే అవకాశం ఉంది.