వ్యాపారంలో అడుగు పెట్టిన కొత్త పెళ్లి కూతురు

0

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆరంభించింది. వివాహితగా మారినంత మాత్రాన తాను సినిమాలకు దూరం అవ్వబోవడం లేదు అంటూ ప్రకటంచిన కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతుంది. ఇప్పటికే ఆమె పలు వ్యాపారాల్లో భాగస్వామిగా ఉండే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఓకీ అనే గేమింగ్ సంస్థలో భాగస్వామిగా చేరింది. ఆ సంస్థలో 15% వాటాను కొనుగోలు చేయడంతో కీలకంగా మారింది. ఆన్ లైన్ గేమింగ్ సంస్థ అయిన ఓకీ ఎన్నో గేమ్స్ ను ఆన్ లోన్ లో వినియోగదారుల కోసం ఉంచింది. ఓకీ గేమింగ్ సంస్థలో భాగస్వామి అయిన కాజల్ మాట్లాడుతూ అమ్మాయిల కోసం ప్రత్యేకమైన గేమ్ ను తీసుకు వస్తామంటూ హామీ ఇచ్చింది.

ముంబయి కేంద్రంగా సాగుతున్న ఈ గేమింగ్ సంస్థలో పెళ్లి అయిన వెంటనే భాగస్వామిగా కాజల్ చేరడంతో ఇందుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గౌతమ్ కిచ్లు కారణం అయ్యి ఉంటాడా అనే చర్చ కూడా జరుగుతుంది. ముంబయి బేస్డ్ వ్యాపార వేత్త అయిన గౌతమ్ పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లుగా పెళ్లికి ముందు వార్తలు వచ్చాయి. ఆయన వ్యాపారాల్లోకి కాజల్ ను ఆహ్వానించి ఉంటాడు అనేది కొందరి మాట. ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే ఒక వైపు ఇండియన్ 2 సినిమాలో నటిస్తూనే మరో వైపు ఆచార్య సినిమా కు కమిట్ అయ్యింది. ఈ రెండు కాకుండా చిన్న సినిమాలు వెబ్ సిరీస్ ల్లో కూడా కాజల్ నటిస్తుంది.