‘అంధకారం’ సినిమా ట్రైలర్..!

0

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ సమర్పణలో వస్తున్న తమిళ చిత్రం ‘అంధగారమ్’. వి.విజ్ఞరాజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఓ2 పిక్చర్స్ మరియు ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సుదాన్ సుందరమ్ – జయరామ్ – ప్రియా అట్లీ – కె.పూర్ణచంద్ర లు నిర్మించారు. ఈ చిత్రంలో పూజా రామచంద్రన్ – అర్జున్ దాస్ – వినోద్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను తెలుగులో ”అంధకారం” పేరుతో అనువాదం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించింది. నవంబర్ 14న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అవుతున్న నేపథ్యంలో తాజాగా ”అంధకారం” ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘అంధకారం’ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా సినిమాపై ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసేలా ఉంది. ఇందులో మనుగడ కోసం ఓ అంధుడి జీవన పోరాటం.. విముక్తి కోసం క్రికెటర్ పోరాటం చూపించినట్లుగా అర్థం అవుతోంది. ‘ఇది చీకటి ప్రపంచం.. నువ్వు అనుకున్నంత సామాన్యమైంది కాదు’ అని ఓ వ్యక్తి చెప్తుండగా.. ‘నేను చూడని చీకటా?’ అని వినోద్ కిషన్ చెప్పే డైలాగ్ బాగుంది. ‘పిజ్జా’ ‘స్వామి రారా’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న పూజా రామచంద్రన్ ఈ సినిమాలో బ్లైండ్ స్కూల్ టీచర్ గా కనిపిస్తోంది. సూపర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ థ్రిల్లింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ తో మంచి విజువల్స్ తో ఉత్కంఠను గురి చేస్తోంది. ఈ చిత్రానికి ప్రదీప్ కుమార్ సంగీతం సమకూర్చగా.. ఏఎమ్ ఎడ్విన్ సాకే సినిమాటోగ్రఫీ అందించారు. ఇక ఈ సినిమాలో కుమార్ నటరాజన్ – మీషా ఘోషల్ – ‘జీవా’ రవి – ‘ రైల్ ‘రవి – మహేంద్ర ముల్లాత్ తదితరులు నటించారు. ‘అంధకారం’ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 14 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.