ఛార్మి 9 నెలల బేబీ బాయ్ తో ప్రభాస్

0

ప్రభాస్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటాడు. మొన్నటి వరకు ఇటలీలో రాధేశ్యామ్ షూటింగ్ లో పాల్గొన్న ప్రభాస్ ఇటీవలే ఇండియాకు వచ్చాడు. త్వరలో రాధేశ్యామ్ హైదరాబాద్ షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ఈ గ్యాప్ లో ఆదిపురుష్ కు సంబంధించిన చర్చల నిమిత్తం ప్రభాస్ ముంబయి వెళ్లబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ సమయంలోనే ప్రభాస్ ఇలా ఛార్మి పెంపుడు కుక్క అలస్కన్మాలమ్యూట్ తో ఇలా ఫొటో దిగాడు. చాలా గంభీరమైన ఛార్మీ పెట్ తో ప్రభాస్ కొద్ది సమయం టైమ్ గడిపినట్లుగా ఉన్నాడు.

ఈ ఫొటోను ఛార్మి షేర్ చేసింది. నా 9 నెలల బేబీ బాయ్ తో డార్లింగ్ అంటూ ఛార్మి కామెంట్ పెట్టి ఈ ఫొటోను షేర్ చేసింది. దాంతో పాటు పూరి కనెక్ట్స్ ను కూడా ఈ ఫొటోకు ట్యాగ్ చేయడంతో ప్రభాస్ ఎక్కడ ఉన్నాడు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూరి ఆఫీస్ లో ఉండి ఉంటాడా అంటూ కొందరు.. ప్రభాస్ ఛార్మి ఎక్కడ ఎందుకు కలిసి ఉంటారు అంటూ మరి కొందరు నెట్టింట ప్రచారం మొదలు పెట్టారు. కొందరు ఔత్సాహిక అభిమానులు మాత్రం పూరి కథను ప్రభాస్ విన్నాడేమో.. త్వరలోనే వీరిద్దరి కాంబో మూవీ ఉంటుందేమో అంటూ ఎవరికి వారు ఊహించేసుకుంటున్నారు. మొత్తానికి ఛార్మి పెట్ డాగ్ తో ప్రభాస్ ఫొటో హాట్ టాపిక్ గా అయ్యింది.