బిగ్ బాస్ సీజన్ 4 : గంగవ్వతో పాటు మరో ఇద్దరికి కరోనా?

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభంకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. సెప్టెబర్ 6వ తారీకు నుండి నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ షో ప్రారంభం కాబోతుంది. ఇలాంటి సమయంలో షో గురించి అనుమానం ఆందోళన కలిగించే విషయం ఒకటి బయట ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ కోసం ఎంపిక అయిన కంటెస్టెంట్స్ లో ముగ్గురికి కరోనా పాజిటివ్ అంటూ సమాచారం అందుతోంది. వారిలో ఒక సింగర్ ఉండగా మరొకరు మైవిలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ మిల్కూరి గంగవ్వ అంటూ ప్రచారం జరుగుతోంది.

గత రెండు మూడు వారాలుగా గంగవ్వ బిగ్ బాస్ షో లో సందడి చేయబోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఆ విషయంలో క్లారిటీ రాలేదు. గత రెండు వారాలుగా మై విలేజ్ షో వారి నుండి వీడియోలు ఏమీ లేవు. కనుక వారు అంతా కూడా గంగవ్వకు తోడుగా బిగ్ బాస్ షో కార్యక్రమం సన్నాహాల్లో ఉన్నారేమో అంటూ కొందరు భావిస్తున్నారు. బిగ్ బాస్ లో గంగవ్వ దాదాపుగా కన్ఫర్మ్ అనుకుంటున్న సమయంలో ఆమెకు కరోనా అంటూ వార్తలు వస్తున్నాయి.

గంగవ్వ తో పాటు మరో ఇద్దరు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన నేపథ్యంలో ఇప్పుడు షో నిర్వాహకులు ఏం చేయాలో పాలుపోక ఆలోచనల్లో పడ్డారట. వీరికి నెగటివ్ వచ్చాక షో లో జాయిన్ చేసే విధంగా షో ఫార్మట్ ను ప్లాన్ చేస్తున్నారట. ముందుగా షో ప్రారంభం రోజు మళ్లీ కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించి ఎవరికి అయితే నెగటివ్ వస్తుందో వారిని లోనికి పంపిస్తారట. ఆ తర్వాత ప్రస్తుతం పాజిటివ్ ఉన్న వారికి నెగటివ్ వచ్చిన తర్వాత హౌస్ లోకి పంపించే యోచన చేస్తున్నారట. మొత్తానికి ఈ సారి కాస్త గందరగోళంగానే షో ఉంటుందని అనిపిస్తుంది. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.