త్రివిక్రమ్ చూపిన దారినే బుట్టబొమ్మ ఫాలో అవుతోందా?

0

స్టార్ హీరోకి ధీటుగా కథానాయికల్ని చూపించే దర్శకులు అరుదుగానే ఉంటారు. చాలా సినిమాల్లో నాయికలకు అంతగా ప్రాధాన్యత కనిపించదు. కేవలం గ్లామర్ కంటెంట్ కోసం మాత్రమే హీరోయిన్లను ఎంపిక చేసుకునేవాళ్లు ఉన్నారు. కానీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దారి వేరు. ఆయన సినిమాల్లో అలా ఉండదు. తన హీరోకి ధీటుగా నాయిక పాత్రను తీర్చిదిద్దడం గురూజీ ప్రత్యేకత.

2020 రికార్డ్ బ్రేకింగ్ హిట్ మూవీ `అల వైకుంఠపురములో` పూజా హెగ్డే రోల్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈ మూవీలో పూజా అందాన్ని ఎలివేట్ చేయడంతో పాటు తన పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యత చాలా ఎక్కువ. బన్నితో సమానంగా కనిపిస్తుంది పూజా పాత్ర. అల అన్న టైటిల్ కి తగ్గట్టే ఆ పాత్రలో పూజా జీవించింది. తాను నటించింది అంటే గురూజీ అలా చూపించారు అంటేనే కరెక్ట్. అంతకుముందు `అరవింద సమేత వీర రాఘవ` చిత్రంలోనూ అరవింద పాత్రలో పూజా కనిపించింది. అయితే ఆ పాత్రతో పోలిస్తే అల పాత్రను పదింతలు గొప్పగా ఆవిష్కరించారు తెరపై.

అందుకే ఇప్పుడు గురూజీ చూపించిన దారినే బుట్టబొమ్మ ఫాలో అయిపోతోందిట. పూజా హెగ్డే కి అలవైకుంఠపురం సినిమాతో స్టార్ డమ్ దక్కింది. అంతకముందు తనకు ఇంత పెద్ద రేంజ్ హిట్ అన్నదే లేదు. పూజా పై త్రివిక్రమ్ గురి పెట్టాక మాత్రం రేంజ్ అమాంతం పెరిగిపోయింది. పూజాని అల పాత్రలో అద్భుతంగా చూపించారు త్రివిక్రమ్. అలాగే తన సొగసరి కాళ్ల అందాన్ని చూపిస్తూ బుట్టబొమ్మ అంటూ మ్యాజిక్ చేశాడు…! థైస్.. కాళ్ల సొగసును చూపించాల్సినంతా చూపించారు గమ్మత్తుగా. ఇది జనాలకి నచ్చడంతో ఇప్పుడు పూజా తన ప్రతి సినిమాలో ఈ తరహా సొగసుల ఎలివేషన్ ( థై షోస్.. కాలి అందాల ఎలివేషన్) పై కాన్సన్ ట్రేట్ చేయాల్సిందిగా డైరెక్టర్స్ కి తనే స్వయంగా సూచిస్తోందట.

ఇటీవలే అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ టీమ్ వదిలిన పోస్టర్ లో కూడా పూజా కాళ్ల మీదనే వ్యూయర్స్ ఫోకస్ పడేలా జాగ్రత్తలు తీసుకొని మరి డిజైన్ చేశారు..! అంటే గురూజీ ప్రభావం ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు.