‘టాలీవుడ్ లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవు’

0

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇండస్ట్రీలోని డ్రగ్స్ వ్యవహారం గురించి వెల్లడిస్తూ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో డ్రగ్స్ ఉపయోగించడం కొన్ని హౌజ్ పార్టీల్లో ఈ డ్రగ్స్ వాడకం సర్వసాధారణంగా మారిందని.. వాళ్ళు ఎక్కువగా వాడేది మాత్రం చాలా ఖరీదైనా కొకైనే అని.. నిషేధిత మాదక ద్రవ్యాల విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ కు సహకారం అందిస్తానని.. మొత్తం గుట్టు బయటపెడతానని చెప్పింది. సుశాంత్ కు ఇండస్ట్రీ ‘డర్టీ సీక్రెట్స్’ తెలుసు కాబట్టే అతను చనిపోవాల్సి వచ్చిందని పేర్కొంది. అంతేకాకుండా తాను ఎఫైర్ నడిపిన ఓ స్టార్ హీరో కూడా డ్రగ్స్ కి బానిస అని.. ఇండస్ట్రీలో దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా మాదకద్రవ్యాలను వినియోగించారని.. పార్టీ ఉంటే ప్రతి ఒక్కరూ అందులో మునిగితేలుతారని.. దాదాపు 99 శాతం మంది డ్రగ్స్ ని నీళ్లలాగే తీసుకుంటారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టాలీవుడ్ లో కూడా డ్రగ్స్ లేకుండా పార్టీలు జరుగవని సినీ నటి బీజేపీ నాయకురాలు మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా మాధవీలత సినిమాలతో కంటే తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువగా ఫేమస్ అవుతూ వచ్చింది. సినిమాలకు దూరమైన తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మాధవీ లత.. సినీ రాజకీయ సమకాలీన అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్టుగా టాలీవుడ్ లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరుగవని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా టాలీవుడ్ పై తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. సుశాంత్ కేసులో ఎన్సీబీ అడుగుపెట్టడాన్ని స్వాగతిస్తున్నానని.. అలానే టాలీవుడ్ పై కూడా దృష్టి పెట్టాలని కోరింది. బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉన్నమాట వాస్తవమేనని.. తెలుగు సినీ ఇండస్ట్రీలో సైతం డ్రగ్స్ వాడకం ఎక్కువ ఉందని మాధవీలత కామెంట్స్ చేశారు. మరి మాధవీలత డ్రగ్స్ ఆరోపణలపై ఇండస్ట్రీ జనాలు ఎలా స్పందిస్తారో చూడాలి.