పీఎస్ పీకే 27: పవన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్

0

కరోనా వచ్చి అడ్డగించిందేకానీ లేదంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ మామూలుగా లేదు. రాజకీయ పార్టీ కోసం ఆయన రెండేళ్లపాటు సినిమా చేయలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఆయన ఒకేసారి మూడు సినిమాలను అనౌన్స్ చేశారు. ఇప్పటికే దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తున్న వకీల్ సాబ్ చిత్రీకరణ 80% పూర్తవగా.. ఆ తర్వాత క్రిష్ తో ఓ సినిమా హరీష్ శంకర్ తో మరో సినిమా అనౌన్స్ చేశాడు.ఈ సినిమాలన్నింటిలో ప్రత్యేకమైనది మాత్రం క్రిష్ తో తీస్తున్నదే.

పవన్ కెరీర్లో ఎప్పుడూ చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా తీయక పోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆసక్తి కలిగించింది. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఏఎం రత్నం మెగా సూర్య మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఇప్పటికే హైదరాబాద్ లో భారీ సెట్లు కూడా నిర్మించారు. 15 రోజుల షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు పవన్ కాస్త బ్రేక్ ఇవ్వడంతో క్రిష్ ఆలోగా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు పీఎస్ పీకే 27పై ఆసక్తికర సంగతి బయటకు వచ్చింది. డిసెంబర్ నుంచి ఈ సినిమాను మళ్లీ సెట్స్ పైకి తీసుకు వెళ్లనున్నట్లు సమాచారం. అన్ని సెట్లు కూడా తీర్చిదిద్దడంతో ఒక్కసారి షూటింగ్ మొదలైతే శరవేగంగా జరుగనున్నది.