చూస్తుంటే నోరూరిపోతోంది పాపా!

0

అసలే చిటపట చినుకులతో వెదర్ కూల్ అయ్యింది. వర్షాకాలానికి టాటా చెబుతూ చలికాలానికి వెల్ కం చెప్పే వేళ ఏపీలో ముసురు తగులుకుంది. తెలంగాణలోనూ వెదర్ కూల్ గానే ఉంది. మబ్బు పట్టిన వేళ చలి గిలి అనకుండా ఇదిగో ఇలా కొత్తగా నాన్ వెజ్ వంటకం ట్రై చేస్తోంది హంసా నందిని.

మాంచి నాటుకోడికి మసాలా పెట్టి చిల్లీ గార్లిక్ పేస్ట్ తగిలించి కారం బాగా దట్టించి అదిరే రుచికరమైన వంటను రెడీ చేసిందట. అక్కడ కోడి తొడలు చూస్తుంటేనే నోరూరిపోతోంది. వెజిటబుల్ ఫ్రూట్స్ వంటి వాటిని కట్ చేసి అందంగా అలా కోడిని అలంకరించి ప్రొఫెషనల్ కుక్ లా కనిపిస్తోంది హంస.

ఇటీవల ఈ అమ్మడు రకరకాల వంటకాల్ని పరిచయం చేస్తూ తన సోషల్ మీడియా యూట్యూబ్ వీడియోలతో అభిమానుల్లోకి దూసుకెళుతోంది. లాక్ డౌన్ సమయంలో తీరిక సమయాన్ని హంసా నందిని బాగానే సద్వినియోగం చేసుకుంది. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెబుతున్నవారికి మళ్లీ మళ్లీ థాంక్స్! అంటూ కొంటెగా వ్యాఖ్యను జోడించింది. అన్నట్టు హంసకు ఇటీవల టాలీవుడ్ లో సరైన ఆఫర్ లేదు. కెరీర్ పరంగా కొత్తగా ఏం ప్లాన్ చేయబోతోందో చెప్పనే లేదు. మరి 2021 ప్రణాళికలు ఎలా ఉన్నాయో చెబుతుందేమో!