Templates by BIGtheme NET
Home >> Cinema News >> KGF 3 Release Date: షాకింగ్ : ‘కేజీఎఫ్ 3’ రిలీజ్ డేట్ ఫిక్స్

KGF 3 Release Date: షాకింగ్ : ‘కేజీఎఫ్ 3’ రిలీజ్ డేట్ ఫిక్స్


KGF 3 Release Date: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన ‘కేజీఎఫ్ 2’ చిత్రం, యావత్తు మాస్ ప్రేక్షక లోకాన్ని చాలా బాగా ఆకట్టుకుంది. అత్యధిక వసూళ్లు రాబట్టి, విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. వెయ్యి కోట్ల క్లబ్‌లో కూడా చేరింది ఈ మూవీ. ఇక ‘కేజీఎఫ్ 2’లోని ప్రతి సీన్ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. ఐతే, కేజీఎఫ్‌ చాప్టర్‌ చాప్టర్‌ ౩ ఉంటుందని ఈ సినిమా నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. నిజంగా యాక్షన్ లవర్స్ కి ఇది గొప్ప శుభవార్త.

ఇంతకీ, కేజీఎఫ్‌ ప్రొడ్యూసర్‌ విజయ్‌ కిరగందూర్‌ ‘కేజీఎఫ్‌ పార్ట్ 3’ పై ఏమి మాట్లాడారు అంటే.. ? ఆయన మాటల్లోనే విందాం. ‘అవును, ఇది అందరికీ నచ్చే వార్తే. కేజీఎఫ్‌ మూడవ భాగాన్ని ఈ ఏడాది డిసెంబర్‌ లో ప్రారంభించబోతున్నాము’ అని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ ప్రభాస్‌ తో ‘సలార్‌’ మూవీని చేస్తున్నాడు. ఇది నవంబర్‌ లోపు పూర్తి కానుంది.

అంటే.. ఆ తర్వాత ‘కేజీఎఫ్‌ 3’ని డిసెంబర్‌ లో స్టార్ట్ చేస్తారట. డిసెంబర్‌ నుంచి ‘కేజీఎఫ్‌ ౩’ వర్క్‌ స్టార్ట్ చేసి.. 2023 లో షూటింగ్‌ చేస్తారట. ఇక 2024లో సంక్రాంతికి సినిమాని రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. కేజీఎఫ్‌ చాప్టర్‌ ౩ పై అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. నిజానికి ఈ సినిమా కథ అయిపోయింది.

కానీ, వచ్చిన మార్కెట్ ను క్యాష్ చేసుకోవడానికి చిత్రబృందం ప్లాన్ చేసుకుంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. మరోపక్క ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు. ఎన్టీఆర్ కోసం ప్రస్తుతం కథ పై కసరత్తులు కూడా చేస్తున్నాడు.

మరి, ప్రశాంత్ చివరకు ఏమి చేస్తాడో చూడాలి. ఎన్టీఆర్ ను కథ విషయంలో ఓప్పించడం చాలా కష్టం. మరి ప్రశాంత్ ఎలా మ్యానేజ్ చేస్తాడో చూడాలి. ఒక్కటి మాత్రం నిజం దక్షిణాది పాన్ ఇండియా సినిమాలలో బాహుబలి తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమానే భారీ విజయం సాధించింది.

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ను నేషనల్ స్టార్ ను చేసింది. దేశంలోని అన్ని పరిశ్రమల్లో ఈ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. పైగా ఈ సినిమా ఓపెనింగ్స్ తో సరికొత్త రికార్డ్స్ సృష్టించింది.