ఇందురూడు సందురూడు చుక్కల్లో సిన్నోడు!

0

సూపర్ స్టార్ మహేష్ ఏజ్ ఎంత? అడగ్గానే ఠకీమని చెప్పేస్తే వెయ్యి డాలర్లు గిఫ్ట్. అసలు ఆయన వయసును కనిపెట్టడం ఎవరికైనా సాధ్యమేనా? 40 ప్లస్ ఏజ్ అంటే అసలు ఎవరూ నమ్మరు. ఇప్పుడే కాలేజ్ చదువు పూర్తి చేసి పల్లెటూరికి పిల్లను వెతుక్కోవడానికి వచ్చిన పెళ్లి(బాలా) కుమారుడిలా నవనవలాడడం ఆయనకే చెల్లింది.

తన వయసును అంతకంతకు తగ్గించేస్తూ మహేష్ ఊహించని షాక్ లిస్తున్నారు. పర్ఫెక్ట్ డైట్ పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటెనెన్స్ అనేవి అందరికీ సాధ్యం కానివి. ఆయన స్టార్ డమ్ పెరిగి సూపర్ స్టార్ అయ్యారంటే అందుకు ఎంతో క్రమశిక్షణ.. డైట్ ప్రణాళిక ఉండడం వల్లనే.

భరత్ అనే నేను.. సరిలేరు నీకెవ్వరు చిత్రాల్లో అల్ట్రా స్టైలిష్ గా కనిపించిన మహేష్ మునుముందు ఇంకా ఇంకా స్టైలిష్ లుక్ తో ట్రీటివ్వబోతున్నారని తాజా లుక్ చెబుతోంది. మహేష్ కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట చిత్రీకరణకు మహేష్ సిద్ధమవుతున్నారు. జనవరి నుంచి అమెరికాలో షూట్ మొదలు కానుంది.

ఈలోగానే ఫ్యామిలీతో ఓ షార్ట్ ట్రిప్ కి బయల్దేరిన మహేష్ ఇదిగో ఇలా కెమెరా కంటికి చిక్కారు. బ్లూ డెనిమ్ .. కాంబినేషన్ టీషర్ట్.. రెబాన్ కళ్లద్దాలతో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు మహేష్. ఇందురూడు సందురూడు చుక్కల్లో చిన్నోడు! అంటూ గాళ్స్ కంటికి కునుకే కరువయ్యేలా చేస్తున్నాడు 45 ఏళ్ల సూపర్ స్టార్.

భద్రతా నియమాల్ని పాటిస్తూ విమానయానం చేశారు. షూటింగ్ కి ఇంకో రెండు నెలల సమయం ఉంది కాబట్టి ఈలోగా ఇలా ఫ్యామిలీతో టూర్ ప్లాన్ చేశారన్నమాట.