Templates by BIGtheme NET
Home >> Cinema News >> హీరోలందరికీ మమ్మీ అవుతున్న వెటరన్ నటి!

హీరోలందరికీ మమ్మీ అవుతున్న వెటరన్ నటి!


శుభ సంకల్పం.. శుభ లగ్నం.. మావి చిగురు.. ఇలా ఎన్నో క్లాసిక్స్ లో నటించారు మేటి కథానాయిక ఆమని. కె.విశ్వనాథ్ సహా ఎందరో దిగ్గజాలంటి దర్శకులతో పని చేసిన ఆమని పరిశ్రమ అగ్ర నటుల సరసన కథానాయికగా నటించి మెప్పించారు. దశాబ్ధాల కెరీర్ లో అగ్ర నాయికగా ఓ వెలుగు వెలిగారు.

తెలుగు సినీపరిశ్రమ ఆమనిని ఒక సీనియర్ గా ఎంతగానో గౌరవించి ప్రేమిస్తుంది. ఆమని అభిమానులు తనని ఎప్పటికీ మరువలేరు. అంత గొప్ప ప్రతిభావని ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో కంబ్యాక్ అవుతున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఎంతో కాంపిటీషన్ ఉన్నా కానీ ఆమని తనదైన శైలిలో వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. చందమామ కథలు చిత్రంలో సీనియర్ నరేష్ సరసన నటించారు. ఆ సినిమాకి జాతీయ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చావు కబురు చల్లగా చిత్రంలో కార్తికేయకు తల్లిగా ఆమని నటించారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలోనూ అఖిల్ కి తల్టిగా ఆమని నటించారు. అఖిల్ బాలనటుడిగా చేసిన సిసింద్రీలోనూ ఆమని తల్లి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అందుకే ఆమె బాలనటుడిగా ఉన్నప్పుడే కాదు.. ఎలిజిబుల్ బ్యాచిలర్ అయ్యాకా అఖిల్ కి తల్లినయ్యాను అంటూ సంబరంగా ఆ విషయాన్ని చెబుతున్నారు. అలాగే అల్లు శిరీష్ కి తల్లిగా నటిస్తున్నానని జగపతి బాబు తో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నవీన్ చంద్రకు తల్లిగా నటిస్తున్నానని ఆమని వెల్లడించారు.