ఏం చేసినా ప్రచారమేనా ఇల్లీ బేబీ?

0

కొందరికి అయినదానికి కాని దానికి కూడా హడావుడి ఎక్కువ ఉంటుంది. గోరంత చేస్తే కొండంత చేసినట్టు ప్రచారం చేసుకోవడం అలవాటు. ఆ కోవకే చెందుతుంది సన్నజాజి సోయగం ఇలియానా. ఈ గోవా చిన్నది గత కొంతకాలంగా సోషల్ మీడియాల్లో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ ఏం చేస్తోందో చూస్తున్నదేగా.

నిరంతరం జిమ్మింగ్ ఫోటోలు వీడియోల్ని షేర్ చేస్తూ భారీగా ఇన్ స్టా ఫాలోవర్స్ ని పెంచుకున్న ఇలియానా .. వీలున్న ప్రతిసారీ బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తోనూ హీట్ పెంచుతూనే ఉంటుంది. ఇక ఇటీవల గత కొంతకాలంగా లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుని బాగా సన్నబడింది. రెగ్యులర్ జిమ్ ఫోటోల్ని వీడియోలను తన అభిమానుల కోసం షేర్ చేసింది.

తాజాగా ఇల్లీ బేబి షేర్ చేసిన ఈ ఫోటోలు చూస్తుంటే విషయం ఏంటో అర్థమైపోతోందిగా. అంతగా ఎలివేషన్ లేనివి చెమటతో తడిసిపోయిన ఫోటోలని కూడా షేర్ చేస్తోంది అమ్మడు. అందంగా ఉన్నా అందంగా లేకపోయినా అలసటతో ఉన్నా ఆ ఫోటోల్ని సెల్ఫీల్ని ఇలా షేర్ చేసేస్తే ఎలా? అంటూ తిట్టేస్తున్నారు కొందరు. ఇల్లీబేబి పబ్లిసిటీ స్టంట్ శ్రుతిమించిందన్న విమర్శలొస్తున్నాయి. ఎన్ని చేసిన ఒకే ఒక్క ఆఫర్ మాత్రమే దక్కించుకోగలిగింది. ది బిగ్ బుల్ మినహా వేరొక ఆఫర్ ఏదీ రాలేదు మరి. ఇటు సౌత్ లోనూ అమ్మడికి ఛాన్సులే లేవ్ ఎందుకనో.