ఇల్లీ టోన్డ్ ఒంపు సొంపులు

0

సన్నజాజి సోయగం ఇలియానా ఇన్ స్టా ట్రీట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. దిశా పటానీ.. అదాశర్మ లాంటి సోషల్ మీడియా రెబల్ క్వీన్స్ తో పోటీపడుతోంది ఈ భామ కూడా. ముఖ్యంగా ప్రియుడు ఆండ్రూ నీబోన్ కి బ్రేకప్ చెప్పేశాక డీప్ క్రైసిస్ లోకి వెళ్లిపోయిన ఈ భామ ఇప్పుడిప్పుడే అన్నిటినీ మర్చిపోతూ నిరంతరం ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటోంది. ఆ క్రమంలోనే ఇల్లీ బేబీ లుక్ పరంగా మార్పులు చేసేందుకు నిరంతరం జిమ్ కి వెళ్లి తీవ్ర కసరత్తులు చేస్తోంది.

ఇటీవల ఇలియానా సన్నజాజి రూపానికి సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఇన్ స్టా వేదికగా రెగ్యులర్ గా వేడెక్కించే జిమ్మింగ్ వీడియోలు.. ఫోటోలతో హీటెక్కిస్తోంది. తాజాగా ఈ సిరీస్ లో మరో కొత్త ఫోటో అంతే ఇదిగా ఆకర్షిస్తోంది. 110 డిగ్రీల కోణంలో ఇల్లీ టోన్డ్ ఒంపు సొంపులు బోయ్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలు వాట్సాపుల్లో వైరల్ గా మారింది.

మరోవైపు తన ఫ్రెండు నర్గిస్ ఫఖ్రీ 41వ పుట్టినరోజు సందర్భంగా ఇలియానా సెలబ్రేషన్ అంతే ఇదిగా బాలీవుడ్ సర్కిల్స్ లో చర్చకు వచ్చింది. నర్గీస్ స్పెషల్ డే సందర్భంగా..`మెయిన్ తేరా` హీరో సహనటులు ఇలియానా డి క్రజ్ … వరుణ్ ధావన్ పుట్టినరోజు బేబికి శుభాకాంక్షలు తెలిపారు. అప్పటి సెట్స్ నుంచి కొన్ని ఫోటోల్ని ధావన్ బోయ్ పంచుకున్నాడు. ఇలియానా- నర్గీస్ – వరుణ్ ల రొమాంటిక్ యాక్షన్ మూవీ 2014 లో విడుదలైంది. ఇలియానా ప్రత్యేకించి నర్గిస్ ఫఖ్రీ అద్భుతమైన చిత్రాన్ని పోస్ట్ చేసి ఆసక్తికర వ్యాఖ్యను జోడించింది. “ఈ ఎత్తైన అందమైన అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు“ అని తెలిపింది.