‘సుందరి’ ప్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

0

హర్రర్ చిత్రాలతో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా పలు సినిమాల్లో ఆకట్టుకున్న హీరోయిన్ పూర్ణ. మలయాళీ అయిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించిన సినిమాలు తక్కువే. ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ సినిమాల వైపు అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం తెలుగుతోపాటు దక్షిణాదిన మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ కోవలోనే పూర్ణ కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తోంది. ఓ ఆసక్తికర చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

కళ్యాణ్ జి. గోగణ దర్శకత్వంలో పూర్ణ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘సుందరి’. కళ్యాణ్ జి. గోగణ మొదట ‘నాటకం’ సినిమాతో పరిచయం అయ్యాడు. ఇప్పుడు లేడి ఓరియెంటెడ్ కథాంశంతో ‘పూర్ణ’తో రెండో ప్రాజెక్ట్ స్ట్రాట్ చేశాడు.

ఒక సాధారణ మహిళ తీసుకున్న ఊహించని నిర్ణయమే ‘సుందరి’ సినిమాగా తీస్తున్నట్టు చిత్రం యూనిట్ తెలిపింది. ఈ మేరకు తాజాగా చిత్రం ప్రీ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. కేవలం కాళ్లు మాత్రమే కనపడేలా భరత నాట్యం ఫోజులో ఇచ్చిన లుక్ ఆకట్టుకుంటోంది. అర్జున్ అంబటి కీలక పాత్ర చేస్తున్నారు. సురేష్ బొబ్బలి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రిజ్వాన్ నిర్మిస్తున్నారు.