మేకోవర్ సరే.. ఫైటర్ సంగతేంటి ఛార్మి మ్యామ్?

0

సోషల్ మీడియాలు అంతా మార్చేసిన సంగతి తెలిసిందే. మనిషి గతి మారిపోయింది. అంతేనా.. సెలబ్రిటీలు సామాన్యుల మధ్య దూరం చెరిపేసింది. ఇక ఇన్ స్టా.. ట్విట్టర్.. యూట్యూబ్ వేదికగా పలువురు స్టార్లు.. నిరంతరం అభిమానుల కోసం ఏదో ఒక ఇన్నోవేటివ్ స్టెప్ తీసుకుంటూ ఆకట్టుకుంటున్నారు. బోలెడంత విజ్ఞానాన్ని పంచేందుకు తారలు ఆసక్తిగా ఉన్నారు.

ఇటీవల ఉపాసన సమంత ప్రజారోగ్యానికి సంబంధించిన ఆసక్తికర విషయాల్ని పంచుకునేందుకు వెబ్ – యూట్యూబ్ మాధ్యమాల్ని ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఛార్మి వంతు. ఈ అమ్మడు గత కొంతకాలంగా మేకప్ స్టైల్స్ హెయిర్ డిజైన్స్ గురించి చెబుతున్నారు. తాజా పోస్టులో కొత్త కేశాలంకరణపై క్లాస్ తీస్కుంది.

అసలు ఈ లుక్ ఎలా ఉంది? అని ప్రశ్నిస్తే.. అందుకు సోషల్ మీడియాల్లో మిశ్రమ స్పందనలే వ్యక్తమవుతున్నాయి. “మీకు జీవితంపై మక్కువ ఉంటే దాన్ని(హెయిర్ స్టైల్) మార్చండి“ అంటూ వ్యాఖ్యను జోడించింది. మొత్తానికి మేకోవర్ క్లాస్ బావుంది కానీ… ఇంతకీ ఫైటర్ సంగతేమిటి? ఎప్పటికి సెట్స్ కెళ్లి పూర్తి చేస్తారు? అన్నదానిపై ఏదైనా అప్ డేట్ చెబితే బావుండేది ఛార్మి మ్యామ్.