క్రాక్ లో నటించాక క్రాక్ బాగా బుర్రకెక్కిందిగా

0

క్రాక్ లో నటించాక క్రాక్ బాగా బుర్రకెక్కిందిగా!! ఇదీ బోయ్స్ కామెంట్. ఎవరిపైనో చెప్పాలా? శ్రుతిహాసన్ ఉన్నట్టుండి తన మైండ్ పొజిషనింగ్ ని ఎలివేట్ చేస్తూ సరికొత్త ఫోటోషూట్లతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాషనిస్టాగా శ్రుతి ఆల్వేస్ క్రియేటివ్.. డిఫరెంట్ అని పొగిడేసేవారు కొందరైతే…ఏమిటీ పిచ్చి వెర్రి వ్యాపకం అని కంగారు పడే అభిమానులు లేకపోలేదు.

ఎవరు ఏమనుకున్నా తన దారి తనకు ఉందని చెప్పకనే చెబుతోంది శ్రుతి ప్రాక్టికల్ గా. శ్రుతి హాసన్ తిరిగి సినిమాల్లోకి వచ్చింది మొదలు తనని తాను ప్రతిసారీ ఏదో ఒక ప్రత్యేకతతో ఎలివేట్ చేసుకునేందుకు పోటీపడుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది. శ్రుతి హాసన్ స్టన్నింగ్ అనిపించే ఫోటోల్ని షేర్ చేస్తోంది. అయితే వీటిలో ఎక్కువగా డార్క్ షేడ్ లో ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. ఇది తన మనుసును ఆవిష్కరిస్తోంది అంటూ ఇప్పటికే బోలెడంత చర్చా సాగుతోంది.

తాజాగా డీప్ బ్లాక్ డార్క్ శారీలో మతి చెడగొట్టింది. ఇక క్యాట్ ఐస్ తో అమ్మడు మైండ్ బ్లాక్ అయ్యే ట్రీటిచ్చిందనే చెప్పాలి. శ్రుతి నెవ్వర్ బిఫోర్ ఫోటోషూట్ ఇదని చెప్పాలి. కర్లీ హెయిర్ .. రిబ్బన్ జాకెట్.. నల్లని వస్త్రధారణలో ఆమె హాట్ లుక్స్ హీట్ పెంచుతున్నాయి. కెరీర్ సంగతి చూస్తే.. శ్రుతి హాసన్ ఇటీవలే `పుతం పుదు కలై` అనే తమిళ సిరీస్ లో నటించారు. రవితేజ క్రాక్ లో నటిస్తున్నారు. సుదీర్ఘ విరామం తరువాత శ్రుతి తిరిగి వరుసగా సినిమాలకు సంతకం చేస్తోంది. కంబ్యాక్ లో ఇలా చెలరేగడం వెనక కారణమేమిటో ఈపాటికే అర్థమైంది కదూ?