గోవా బ్యూటీ వర్కవుట్ నడుము ఒంపు ఫోటో

0

ఇల్లియానా చిల్లియానా! అంటూ ఎంతో చిలౌట్ అవుతూ రాశాడో సినీకవి. ఆ నడుము వొంపులో సొంపులకు మురిసిపోయి మైమరిచి రాశాడా .. లేక శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ అలానే కావాలని అడిగి రాయించుకున్నారా? అన్నది అలా ఉంచితే.. త్రీఇడియట్స్ సౌత్ రీమేక్ `స్నేహితుడు`లో ఆ పాట యూత్ కి విజువల్ ఫీస్ట్ గా నిలిచింది. సన్నజాజి ఇలియానా నడుము ఊపుడు స్టెప్పులకు రెండు కళ్లు చాల్లేదు మరి.

అదంతా సరే కానీ.. లేటెస్టుగా ఇలియానా షేర్ చేసిన నడుము ఒంపు ఫోటోలు కుర్రకారుకు కిర్రెక్కించేయడం గ్యారెంటీ. టైట్ స్పోర్ట్ డ్రెస్ లో ఇలియానా జిమ్ చేస్తూ చెమటలు కక్కేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇలాంటి ఒక్కో ఫోటోని షేర్ చేసినందుకు ఈ అమ్మడు లక్షల్లో డిమాండ్ చేస్తోందట. వీటిని ఏవైనా కార్పొరెట్ కంపెనీలకు ఉచితంగా అయితే డొనేట్ చేయదన్నది కొందరు ట్రేడ్ నిపుణుల విశ్లేషణ. ఇక కథానాయికల వేడెక్కించే ఫోటోషూట్లతో మ్యాగజైన్లు.. దినపత్రికలు ఏ మేరకు లాభపడుతుంటాయో తెలిసిన వ్యవహారమే.

ఇలియానా డి క్రజ్ బాలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ ని షేక్ చేయాలన్న పంతంతో ఉంది. ఆ క్రమంలోనే లోకల్ గా మ్యాగజైన్లకు కొన్ని ఎక్స్ క్లూజివ్ ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. తాజాగా ఈ గోవా బ్యూటీ లేటెస్ట్ వర్కవుట్ సెల్ఫీని పంచుకుంది. కేవలం ఇన్ స్టాలోనే ఈ అమ్మడిని కోటి 20లక్షల మంది అనుసరిస్తున్నారు. అంతే వేగంగా ఈ ఫోటో వైరల్ అయిపోతోంది.

కెరీర్ సంగతి చూస్తే.. ఇలియానా చివరిసారిగా పాగల్ పంథి చిత్రంలో నటించింది. జాన్ అబ్రహం- అనిల్ కపూర్- అర్షద్ వార్సీ ఈ చిత్రంలో ఇతర తారాగణం. అనీస్ బాజ్మీ తెరకెక్కించారు. తదుపరి రాబోయే ప్రాజెక్ట్ లో అభిషేక్ బచ్చన్ సరసన నటిస్తోంది. హర్షద్ మెహతా కుంభకోణం నేపథ్యంలోని సినిమా ఇది.