ఐసీయూలో రేణు.. ప్రియుడి మృతితో డిప్రెషన్

0

ఇండియన్ ఐడల్ సీజన్ 10తో మెరిసిన సింగర్ రేణు ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఆమె ప్రస్తుతం రాజస్థాన్ అల్వార్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఐసీయూలో ఉంచి ఆమెకు ట్రీట్మెంట్ అందిస్తున్నట్లుగా వైధ్యులు పేర్కొన్నారు. ఆమె తీవ్రమైన డిప్రెషన్ కు లోనవ్వడంతో అనారోగ్యం పాలయినట్లగా తెలుస్తోంది. రవి శంకర్ అనే వ్యక్తితో ఈమె ప్రేమాయనం సాగించింది. అతడు ఇటీవల ఆత్మహత్య చేసుకోవడంతో రేణు కూడా అనారోగ్యం పాలయ్యింది.

కొన్ని నెలల క్రితం నుండి రవి శంకర్ అనే పెళ్లి అయిన వ్యక్తితో రేణు ప్రేమలో ఉంది. రేణు ప్రేమను కుటుంబ సభ్యలు ఒప్పుకోలేదు. దానికి తోడు రవి శంకర్ అప్పటికే వివాహం అయ్యింది. కనుక వారి ప్రేమకు రెండు వైపుల నుండి అడ్డంకులు ఎదురయ్యాయి. దాంతో వారిద్దరు లేచిపోయారు. రేణు తండ్రి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి వారిని వెనక్కు తీసుకు వచ్చారు.

పోలీసు కేసు ఇతర్రత విషయాలతో మనస్థాపంకు గురైన రవి శంకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండి రేణు కూడా జీవించాలని లేదంటూ ఏడుస్తూనే ఉందట. దాంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. గాయినిగా ఎంతో మంచి పేరు తెచ్చకుంటుందని ఆశించిన రేణు ఇలా అవ్వడంతో ఆమె తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్నాడు.