Templates by BIGtheme NET
Home >> Cinema News >> అనిరుద్.. రెహమాన్ రేంజ్ లో లేదయ్య!

అనిరుద్.. రెహమాన్ రేంజ్ లో లేదయ్య!


ఈ మధ్యకాలంలో తమిళ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ వరస సక్సెస్ లతో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న సంగీత దర్శకుడిగా ఉన్నాడు. జైలర్, జవాన్ సినిమాల సక్సెస్ తో అనిరుద్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

లైగర్ సినిమాతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా మ్యూజిక్ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకి రీచ్ కాలేదు. శంకర్ దర్శకత్వంలో ఇండియన్ కి సీక్వెల్ గా ఇండియన్ 2 మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ హీరోగా సిద్ధమవుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది. 27 ఏళ్ళ క్రితం వచ్చిన ఇండియన్ మూవీ ఇప్పటికి ఎవర్ గ్రీన్ అని చెప్పాలి.

దానికి సీక్వెల్ అంటే ఎక్స్ పెక్టేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో చెప్పొచ్చు. ఇండియన్ సినిమాకి ఏఆర్ రెహమాన్ నెక్స్ట్ లెవల్ మ్యూజిక్ అందించారు. అ సినిమా రెహమాన్ ని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా నిలబెట్టింది. ఇప్పటికి ఇండియన్ సినిమాలో సాంగ్స్ ని ప్రేక్షకులు ఆశ్వాదిస్తూ ఉంటాయి. తాజాగా ఇండియన్ 2 మూవీ ఇంట్రో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ కమల్ హసన్ క్యారెక్టర్ ఇంట్రో గ్లింప్స్ కి అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ అయితే అంత ఎఫక్టివ్ గా లేదనే మాట వినిపిస్తోంది. రెహమాన్ తో పోల్చి చూసుకుంటే అనిరుద్ మ్యూజిక్ చాలా వీక్ గా ఉందని ఇండియన్ మూవీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇండియన్ 2కి అనిరుద్ మ్యూజిక్ అస్సలు ఇంపాక్ట్ తీసుకురాలేదని సినీ విశ్లేషకులు కూడా అంటున్నారు.

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా బ్రాండ్ క్రియేట్ చేసుకున్న కూడా రెహమాన్ స్థాయిని మాత్రం అందుకోలేకపోయాడని ఇంట్రో చూసిన వారు చెబుతున్న మాట. జైలర్, జవాన్ సినిమాలకి అనిరుద్ మ్యూజిక్ ప్లస్ అయ్యిందనే చెప్పొచ్చు. అదే మ్యూజిక్ లియోని నిలబెట్టలేకపోయింది. మరి ఇండియన్ 2 సినిమాకి అనిరుద్ మ్యూజిక్ ఎంత వరకు ప్లస్ అవుతుందనేది వేచి చూడాలి.