Templates by BIGtheme NET
Home >> Cinema News >> టాటుల‌పై స‌మంత మౌన‌మేలా?

టాటుల‌పై స‌మంత మౌన‌మేలా?


నాగ‌చైత‌న్య‌-స‌మంత విడాకుల‌తో వేరై ఎవ‌రి స్వేచ్ఛాయుత జీవితంలో వారు బిజీ అయ్యారు. చైత‌న్య సినిమా షూటింగ్ ల్లో ఉంటే…స‌మంత విశ్రాంతిలో భాగంగా అమెరికాలో ఉంది. ఇక చైతో జ్ఞాప‌కాల‌కు సంబంధించి స‌మంత వేయించుకున్న మూడు టాంటూలు పై ఇప్ప‌టికీ చ‌ర్చ జరుగుతూనే ఉంది. రాను రాను అదో పెద్ద మిస్ట‌రీగానూ మారుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. స‌రిగ్గా స‌మంత మెడ కింద భాగంలో YMC అని రాసి ఉంటుంది.

మ‌రోటి బాణం గుర్తు టాటూ.. ఇంకోటి.. రిబ్స్ పై చై అని ఉంటుంది. అయితే చైతో విడాకుల త‌ర్వాత ఆ జ్ఞాప‌కాలన్నింటిని చెరిపేసిన‌ట్లు తెర‌పైకి వ‌చ్చింది. వివిధ ఫోటో షూట్ల స‌మ‌యంలో ఆ సంగ‌తి బ‌య‌ట‌ప డింది. విడిపోయిన బంధంలో గుర్తులెందుకు అన్న‌ట్లు? చై జ్ఞాప‌కాల నుంచి పూర్తిగా దూర‌మ‌య్యేందుకు అలా చేసి ఉంటుంద‌ని నెట్టింట ప్ర‌చారం సాగింది. నిన్న మొన్నటి వరకు షేర్ చేసిన ఫోటోల్లో కూడా ఆ టాటూ మాయం అయినట్లు కనిపించింది.

తాజాగా అదే టాటూ తో పెద్ద ట్విస్ట్ క‌నిపిస్తోంది. సమంత ఒంటిపై మళ్లీ ఆ టాటూ ప్రత్యక్ష్యం అయింది. చై అనే టాటూ ఉన్న‌ట్లు తాజాగా షేర్ చేసిన ఫోటో షూట్ల‌లో క‌నిపిస్తుంది. స‌మంత రిబ్స్ పై అది క్లియ‌ర్ గా ఉంది. దీంతో గ‌త ఫోటో షూట్ల‌లో క‌నిపించ‌ని టాటూ మ‌ళ్లీ ఎలా వ‌చ్చింది? అంటూ చ‌ర్చ సాగుతోంది. అయితే ఈ విష‌యంలో స‌మంత ఎలాంటి బ‌ధులివ్వ‌లేదు. గ‌తంలోనూ సైలెంట్ గానే ఉంది.

ఇప్పుడు అదే త‌ర‌హా మౌనం వ‌హిస్తుంది. ఇది ఆమె వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన అంశం కాబ‌ట్టి దీన‌పై చ‌ర్చ అన‌వ‌స‌ర‌మైన‌దే. ప్ర‌స్తుతం స‌మంత అమెరికాలో విశ్రాంతి తీసుకుంటుంది. ఇంకా కొన్ని నెల‌లు పాటు అక్క‌డే ఉంటుంది. అటుపై మ‌ళ్లీ తిరిగొచ్చి సినిమాలు చేయ‌నుంది. ఇప్ప‌టికే బాలీవుడ్ లో కొన్ని ప్రాజెక్ట్ లు సెట్ చేసి పెట్టింది. వాటి సంగ‌తి రిట‌ర్న్ జ‌ర్నీ అనంత‌రం చూడ‌నుంది.