మాజీ బోయ్ ఫ్రెండ్ తో మళ్లీ జాన్వీ డేటింగ్?

0

కెరీర్ ని జెట్ స్పీడ్ తో ముందుకు నడిపిస్తున్న నేటితరం స్టార్ గా జాన్వీ కపూర్ పేరు మార్మోగుతోంది. జాన్వీ వ్యక్తిగత వృత్తిగత వ్యవహారాలు అభిమానులకు బహిరంగ రహస్యం. ఈ భామ రాజకీయ నాయకుడి కుమారుడైన శిఖర్ పహారియాతో డేటింగ్ చేసిందని చాలా కాలం క్రితమే కథనాలొచ్చాయి. ఇప్పుడు మరోసారి మాజీలు కలిసారంటూ ప్రచారం సాగుతోంది. జాన్వీ ఇటీవల ఢిల్లీలో తన మాజీ ప్రియుడు శిఖర్ తో కలిసి ఓ ఈవెంట్ లో కనిపించింది. శిఖర్ పహారియా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. విడిపోవడానికి ముందు వారిద్దరూ కొన్నేళ్ల పాటు ఒకరితో ఒకరు డేటింగ్ చేశారని కథనాలొచ్చాయి. అయితే ఈ జంట తమ సంబంధాన్ని ధృవీకరించలేదు.

ఇటీవల మరోసారి ఢిల్లీలో జరిగిన ఓ ఫ్యాషన్ షోకు జాన్వీ – శిఖర్ హాజరయ్యారు. ఈ ఈవెంట్ నుండి వీరిద్దరికి సంబంధించిన అనేక ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు డేటింగ్ రిపీటవుతోందా? మాజీ ప్రేమికులు మళ్లీ రీయునైట్ అవుతున్నారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

“మీరు మళ్లీ కలిసి ఉన్నారా?” అంటూ ఒక నెటిజనుడు జాన్వీని ఇప్పుడు అడిగేశాడు. మీ ఇద్దరినీ మళ్లీ కలిసి చూడటం ఆనందంగా ఉందని అన్నాడు. జాన్వీ కపూర్- శిఖర్ పహారియాల మాల్దీవుల విహారం కూడా కొద్దిరోజుల క్రితం చర్చనీయాంశంగా మారింది. జాన్వీ ఇటీవల మాల్దీవుల నుండి తిరిగి వచ్చింది. తనతో పాటు శిఖర్ కూడా ఉన్నట్లు పేర్కొంది. నటి చంద్రకాంతిలో మెరుస్తూ ఉన్న తన ఫోటో ఒకటి షేర్ చేయగా.. మాజీ ప్రియుడు శిఖర్ కూడా అదే చిత్రాన్ని షేర్ చేయడంతో ఈ జంట మాల్దీవుల విహారం కన్ఫామ్ అయింది. ఇప్పుడు మరోసారి ఈ జంట పబ్లిక్ వేదికపై కలుసుకుంది. జాన్వీ కపూర్ – శిఖర్ పహారియాల సంబంధాన్ని ఇంతకుముందు కరణ్ జోహార్ ధృవీకరించారు. ‘కాఫీ విత్ కరణ్ 7’ ఎపిసోడ్ లో సారా అలీ ఖాన్ – జాన్వీ లతో ఎపిసోడ్ లో శిఖర్ తో జాన్వీ సంబంధాన్ని ధృవీకరించారు.

ఇక కెరీర్ మ్యాటర్ కి వస్తే.. జాన్వీకి ఇప్పటివరకు 2022 సంవత్సరం కెరీర్ పరంగా ఎంతో కలిసి వచ్చిందని చెప్పాలి. గుడ్ లక్ జెర్రీ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. జూలైలో డిస్నీ+ హాట్ స్టార్ లో విడుదలైన ఈ చిత్రంలో జాన్వీ ప్రధాన పాత్రను పోషించింది. సిద్ధార్థ్ సేన్ గుప్తా దీనిని తెరకెక్కించారు.

గత నెలలో థియేటర్లలో విడుదలైన మిలీలో ఉత్తమ నటనతో ఆకట్టుకుంది. ఆమె తండ్రి బోనీ కపూర్ నిర్మించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ లోను ప్రధాన పాత్రను పోషించింది. తదుపరి వరుణ్ ధావన్ తో కలిసి ‘బవాల్’ లో కనిపించనుంది. ఈ చిత్రం 2023లో విడుదల కానుంది. రాజ్ కుమార్ రావుతో కలిసి ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ కూడా సెట్స్ పై ఉంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ క్రికెటర్ పాత్రలో కనిపించనుంది.

Note : Your feedback is important to us. please let us know whether you LIKE the content or not. request not to post any abuse comments or feedback.