Templates by BIGtheme NET
Home >> Cinema News >> నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ హీరోయిన్ దొరకడం కష్టమే : రవితేజ

నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ హీరోయిన్ దొరకడం కష్టమే : రవితేజ


మాస్ మహారాజ్ రవితేజ హీరోగా త్రినాథ రావు నక్కిన డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా ధమాకా. ఈ నెల 23న రిలీజ్ అవుతున్న ధమాకా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. ఈ ఈవెంట్ లో రవితేజ ఎనర్జిటిక్ స్పీచ్ ఆయన మాస్ ఫ్యాన్స్ ని అలరించింది. సినిమాకు పనిచేసిన నటీనటుల అందరికి గురించి చెప్పిన రవితేజ హీరోయిన్ శ్రీలీల గురించి అద్భుతంగా మాట్లాడారు.

రెండో సినిమాకే ఈ అమ్మాయి ఎంతో క్రేజ్ తెచ్చుకుంది.. అందంతో పాటు టాలెంట్.. బండిల్ ఆఫ్ టాలెంట్ ఆమె సొంతం. నెక్స్ట్ ఇయర్ కల్లా ఈమె వేరే రేంజ్ కి వెళ్తుందని అన్నారు రవితేజ. ఏమో మనకి డేట్స్ కూడా ఇస్తుందో లేదో ముందే పెట్టేసుకోండని అన్నారు. శ్రీలీల కి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ చెప్పారు. తనతో మళ్లీ మళ్లీ కలిసి పనిచేయాలని ఉందని అన్నారు రవితేజ. ధమాకా సినిమాకు మ్యూజిక్ అందించిన భీమ్స్ ని ఆడుకున్నారు రవితేజ. అప్పుడప్పుడు కొద్దిగా మాట్లాడటం నేర్చుకో అని అన్నారు. ఎక్స్ ప్రెస్ చెయ్.. మాట్లాడమని తను ఎన్నోసార్లు తిట్టానని అన్నారు. ఈ సినిమాకు భీమ్స్ కూడా నెక్స్ట్ లెవల్ కి వెళ్తాడని అన్నారు. తనని దృష్టిలో పెట్టుకునే ఒక్కో పాట ఇచ్చాడని అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.. అప్పుడప్పుడు కొద్దిగా మాట్లాడు.. నీ నుంచి కోరేది అదే అని అన్నారు రవితేజ.

ఈ సినిమా నిర్మించిన పీపుల్స్ మీడియా బ్యానర్ గురించి చెబుతూ.. ఈ నిర్మాతలకు చాలా తక్కువ సమస్యలు ఉంటాయి.. అందరు పాజిటివ్ పీపుల్.. విశ్వ ప్రసాద్ చాలా తక్కువ మాట్లాడతారు.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అని ఏ ముహూర్తాన పెట్టారో కానీ ఇది నిజంగానే ఫ్యాక్టరీగా మారిందని అన్నారు. ఈ సంస్థలో తాను సినిమాలు చ్స్తూనే ఉంటానని అన్నారు రవితేజ.

సినిమా మరో నిర్మాత వివేక్ గురించి చెబుతూ.. అతను కష్టజీవి.. పాజిటివ్ పర్సన్.. చిరాకు వచ్చినా అతనిలో కబడదు.. అది తను కనిపెట్టగలనని అన్నారు. ప్రతి దానికి ఓకే అని అంటారు. కాని నో చెప్పడం నేర్చుకోమని నేను చెబుతానని అన్నారు. తనకు ఇష్టమైన వ్యక్తి వివేక్. ఈ ఈ బ్యానర్ కూడా నెక్స్ట్ లెవల్ కు వెళ్తుందని అన్నారు.

రైటర్ ప్రసన్న సినిమా చూపిస్త మావ టైం లోనే తన వర్క్ నచ్చింది. అప్పుడు కలవడం కుదరలేదు. రైటర్ నుంచి డైరక్టర్ గా కూడా ప్రమోట్ అయ్యాడు. అయినా సరే రైటర్ గా కొనసాగాలని అన్నారు. డైరెక్టర్ త్రినాధ రావు చాలా పవర్ ఫుల్ గా మాట్లాడారు. ఆయనలో కాన్ఫిడెన్స్ నచ్చిందని అన్నారు. సక్సెస్ మీట్ లో ఇంకాస్త ఎక్కువ మాట్లాడతానని అన్నారు రవితేజ. చివరగా జై సినిమా అంటూ తన ప్రసంగం ముగించారు.