గెస్ట్ రోల్ కోసం NBK అంత డిమాండ్ చేశారా?

0

యంగ్ హీరో నాగశౌర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రెండు చిత్రాలు సెట్ పై వుండగానే మరో రెండు చిత్రాల్ని ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీదేవీ మూవీస్ బ్యానర్ లో శివలెంక కృష్ణ ప్రసాద్ ఓ చిత్రాన్ని నాగశౌర్యతో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో వుంది. విభిన్నమైన కథతో కొత్త పంథాలో రూపొందనున్న ఈ చిత్రంలో హీరో బాలకృష్ఱ కీలక అతిథి పాత్రలో నటించనున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. శ్రీదేవీ మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ గతంలో బాలకృష్ణ హీరోగా `ఆదిత్య 369`- వంశానికొక్కడు- భలేవాడివి బాసూ వంటి చిత్రాలు నిర్మించారు. ఆ చనువుతో బాలయ్యని కీలక పాత్ర కోసం అడిగారని ప్రచారం జరిగింది.

అయితే తాజా సమాచారం ప్రకారం.. నాగశౌర్యతో కలిసి నటించాలంటే భారీ స్థాయిలో పారితోషికాన్ని బాలకృష్ణ డిమాండ్ చేస్తున్నారట. దీంతో నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ వెనక్కి తగ్గినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు.