కరోనా సెకండ్ వేవ్ తో ‘సర్కారు వారి పాట’ కీలక నిర్ణయం

0

ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మొదలు అవుతుంది అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇకపై రాబోతున్న మూడు నెలలు ఒక లెక్క అన్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ ప్రారంభం అయినట్లుగా అనిపిస్తుంది. కేసుల సంఖ్య ఒక్కసారిగా డబుల్ త్రిబుల్ అవ్వడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. అమెరికాలో కూడా కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయినట్లుగా అనిపిస్తున్న నేపథ్యంలో మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా టీం తమ షెడ్యూల్ ను వాయిదా వేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

డిసెంబర్ నెలలో సర్కారు వారి పాట మొదటి షెడ్యూల్ అమెరికాలో జరగాల్సి ఉంది. ఇప్పటికే వీసాకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇదే సమయంలో సినిమాకు సంబంధించిన షూటింగ్ కోసం అన్న ఏర్పాట్లు అక్కడ కూడా జరిగాయి. ఇంతలో సెకండ్ వేవ్ అంటూ ఉండటంతో షూటింగ్ ను వాయిదా వేసుకోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం అయ్యిందట. వచ్చే నెల అమెరికా ప్రయాణంను మహేష్ టీం వాయిదా వేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అమెరికా వెళ్లకుండా ఇక్కడే ఒక షెడ్యూల్ ను ఏమైనా ప్లాన్ చేయబోతున్నారా అనేది చూడాలి.