బిబి4 ఫైనల్ ఎపిసోడ్ డేట్ ఫిక్స్

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కు ఆశించిన స్థాయిలో రేటింగ్ రావడం లేదు అనేది బలంగా వినిపిస్తున్న ప్రచారం. వీక్ డేస్ రేటింగ్ చాలా తక్కువగా ఉండటంతో రేటింగ్ పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సీజన్ ముగింపు దశకు వచ్చింది. మరో నాలుగు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ ఎప్పుడు ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసమయంలో స్టార్ మా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 20వ తారీకు ఆదివారం నాడు షో ఫైనల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వనుందని అంటున్నారు.

గత సీజన్ లో గెస్ట్ గా చిరంజీవి వచ్చిన విషయం తెల్సిందే. మరి ఈ సీజన్ కు ఎవరు గెస్ట్ అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే బిగ్ బాస్ ఫినాలే గెస్ట్ పై నిర్వాహకులు ఒక నిర్ణయం తీసుకుంటారు. గత సీజన్ కు మెగాస్టార్ గెస్ట్ గా రావడంతో ఈసారి యంగ్ స్టార్ హీరో గెస్ట్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 4 విజేత ఎవరు అనే విషయంలో చాలా రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. టాప్ లో ఉన్న వారు మాత్రం అభిజిత్ మరియు సోహెల్ అంటున్నారు. సీజన్ 2 విన్నర్ అయిన కౌశల్ ఖచ్చితంగా అభిజిత్ లేదా సోహెల్ అంటున్నాడు. వారిద్దరిలో ఎవరికి ప్రేక్షకులు ఓట్లు వేస్తారు అనేది చూడాలి.