విశ్వసుందరినే వెనక్కి నెట్టి 2020 నేషనల్ క్రష్ అయ్యింది

0

ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ ల సరసన చేరింది రష్మిక మందన. కెరీర్ ప్రారంభించిన తక్కువ కాలంలో ఫేమస్ అయిపోయిన బ్యూటీగా పాపులరైంది. కన్నడలో `కిరిక్ పార్టీ` చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ కన్నడ కస్తూరి తరువాత స్టార్ డమ్ ని సొంతం చేసుకుంది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడంతో తెలుగులో అత్యంత క్రేజీ యువ కథానాయికగా ముందు వరుసలో నిలిచింది.

విజయ్ దేవరకొండ సరసన నటించిన `గీత గోవిందం` బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన `సరిలేరు నీకెవ్వరు`లో నటించి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.

కథనాయికగా తెలుగు- తమిళ- కన్నడ భాషల్లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నరష్మిక ను నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా రికార్డుకెక్కిందట. ఇదే విషయాన్ని గూగుల్ సెర్చ్ ఇంజిన్ చూపిస్తుండటం ఆసక్తికరంగా మారింది. గూగుల్ లో ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా 2020’ ను సెర్చ్ చేస్తే రష్మిక మందన్నని మాత్రమే చూపిస్తుండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

రష్మిక డ్రెస్సింగ్ స్టైల్ నచ్చడం వల్లే ఆమెని నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా నేషనల్ వైడ్ గా గుర్తించారట. గమ్మత్తైన విషయం ఏంటంటే జాతీయ స్థాయిలో అంటే తెలుగు- కన్నడ భాషల్లో తప్ప రష్మిక మరే ఇతర భాషల్లో సినిమాలు చేయలేదు. అయితే ఆమె నటించిన భీష్మా- గీత గోవిందం- సరిలేరు నీకెవ్వరు- ఛలో చిత్రాలని హిందీలో డబ్ చేశారు. దీంతో ఆమెకు ఈ క్రేజ్ లభించిందని టాక్. ఇప్పటి వరకు ఈ ఘనతని సాధించిన వారు దిశా పటాని- ప్రియా ప్రకాష్- మనుషి చిల్లర్ గత కొన్నేళ్లుగా నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా నిలిచారు. ఇప్పుడు ఈ జాబితాలో రష్మిక చేరడం విశేషం.