‘విరూపాక్ష’ను డైరెక్టర్-హీరో పక్కన పెట్టేసారా..?

0

వకీల్ సాబ్ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినీఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే షూటింగ్ పూర్తిచేయడానికి టీమ్ సిద్ధంగా ఉంది. కరోనా మహమ్మారి కారణంగా అన్నీ సినిమాలతో పాటు వకీల్ సాబ్ కూడా నిలిచిపోయింది. వకీల్ సాబ్ షూటింగులో ఉండగానే పవన్ కళ్యాణ్ తన తదుపరి ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టాడు. ఇదిలా ఉండగా కరోనా భయంతో షూటింగ్స్ నిలిచిపోవడం వలన వకీల్ సాబ్ టీం అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించింది. ప్రస్తుతం వరుసగా మూడు ప్రాజెక్ట్స్ షూటింగ్స్ కి రెడీ అవుతున్నాయి. పవన్ నుండి ఫస్ట్ వకీల్ సాబ్ విడుదల కానుంది. అలాగే డైరెక్టర్ క్రిష్ తో ‘విరూపాక్ష’ ఆ తరువాత గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమాలు వస్తాయని అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత ఓ భారీ సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

పవన్ వకీల్ సాబ్ షూట్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడట. దీనికి తక్కువ సిబ్బంది సరిపోతుందట. పవన్ కూడా ఈ చిత్రం కేవలం 15 రోజుల్లో పూర్తి చేయనున్నాడట. ఇక తన తదుపరి ప్రాజెక్ట్ క్రిష్ సినిమా నిలిపివేసి.. హరీష్ శంకర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తారని ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం తెలిసి దర్శకనిర్మాతలు కాస్త ఆలోచనలో పడ్డారట. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ ప్రాజెక్ట్ గురించి ఆలోచించట్లేదట. క్రిష్ సినిమా చారిత్రక నేపథ్యంలో సాగుతుంది కాబట్టి చిత్రీకరణకు వందలాది మంది సిబ్బంది అవసరం. అందుకే క్రిష్ ఎఎం. రత్నం ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ పై ఇప్పటి వరకు ఒత్తిడి పెట్టలేదట. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ విరూపాక్ష ప్రాజెక్ట్ గురించి ఆలోచన చేయట్లేదట. మరో ఆరు నెలలు గడిస్తే గాని ఏమి చెప్పలేం అని అన్నారట. అందుకని డైరెక్టర్ క్రిష్ ఈ ఆరు నెలల్లో మరో సినిమాను చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరగనుందో..!