Templates by BIGtheme NET
Home >> Cinema News >> నేనూ సాయం చేశా కాని ఫొటోలు దిగడం మర్చిపోయా

నేనూ సాయం చేశా కాని ఫొటోలు దిగడం మర్చిపోయా


ఈ మద్య కాలంలో సోషల్ మీడియాలో సోనూసూద్ చేసిన ఆర్థిక సాయం మరియు లాక్ డౌన్ సమయంలో అతడు వలస కార్మికులకు చేసిన సాయం గురించి తెగ చర్చించుకుంటున్నారు. నెట్టింట ఆయన్ను రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపించారు. సినీ ప్రముఖులు కూడా పలువురు ఆయనపై ప్రశంసలు కురిపించారు. తాజాగా హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఈ విషయమై స్పందించాడు. వలస కార్మికులకు ఒక సూర్యుడి మాదిరిగా సోనూసూద్ నిలిచి సాయం చేశాడు. ఇటీవల కూడా ఆయన చేస్తున్న సాయాలు నిజంగా అభినందనీయం అన్నాడు. ఈ సమయంలో తాను కూడా సాయం చేసినట్లుగా చెప్పకనే చెప్పాడు.

నేను సాయం చేసే సమయంలో ఫొటోలు తీసుకోలేదు అదే నేను చేసిన మిస్టేక్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఆమద్య బ్రహ్మానందం సీసీసీ కోసం ఇచ్చిన విరాళం విషయంలో విమర్శలు ఎదురయ్యాయి. కోట్ల ఆస్తి ఉన్న బ్రహ్మానందం అంత తక్కువ సాయం చేయడం విడ్డూరంగా ఉందంటూ మీమ్స్ వచ్చాయి. కొన్ని సంవత్సరాల ముందు వరకు రోజుకు లక్షల్లో పారితోషికం తీసుకున్న ఆయన చేసిన సాయంకు ఆయనకు ఉన్న పేరుకు ఎక్కడ పొంతన లేదని జనాలు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇప్పుడు మాత్రం తనకు చేతనైనంత సాయం ఖచ్చితంగా చేస్తున్నాను అంటూ బ్రహ్మానందం అన్నాడు. డబ్బు విషయంలో నేను కఠినంగా ఉంటాను. నేను ఉండటంతో పాటు ఇతరులను కూడా డబ్బు విషయంలో కఠినంగా ఉండమని చెబుతాను. సోనూసూద్ సూర్యుడి మాదిరిగా సాయం చేస్తే నేను మిణుగురు పురుగు మాదిరిగా నా మేరకు నేను సాయం చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో ఇంటి అద్దె చెల్లించలేక పోవడంతో సామాను బయట పడేశారని నా వద్దకు వచ్చాడు. అప్పుడు అతడికి కావాల్సిన సాయం చేశాను. అందుకే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు తినడానికి తిండి ఉండేలా చూసుకోండి అని చెబుతాను. అప్పుడు ఎవరు కూడా మీ సామాన్లు బయట పడేసే పరిస్థితి రాదు అన్నాడు.