బిగ్ బుల్ .. డాలర్లు పోగొట్టుకున్న ఇల్లీ ఫేసు ఇదిగో

0

అభిషేక్ బచ్చన్.. ఇలియానా ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ది బిగ్ బుల్. స్టాక్ మార్కెట్ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ డ్రామాతో తెరకెక్కుతున్న ఈ సినిమాని స్టార్ హీరో అజయ్ దేవగన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విఐపి మల్టీప్లెక్స్ లో విడుదల చేయనున్నట్లు బచ్చన్ జూనియర్ గతంలో ప్రకటించారు.

హాట్స్టార్ విఐపిపై వర్చువల్ ఇంటరాక్షన్ లో బోల్ బచ్చన్ తర్వాత రెండోసారి దేవ్ గన్ తో కలిసి పనిచేస్తున్నానని అభిషేక్ వెల్లడించారు. ది బిగ్ బుల్ పోస్టర్ ను షేర్ చేస్తే అది కాస్తా అభిమానుల్లో వైరల్ అయ్యింది. కథాంశంపై వెల్లడిస్తూ… ఈ కథ 1980 ల చివరలో మొదలై 90 ల ప్రారంభంలో ముగుస్తుందని.. ముంబై నేపథ్యంలో ఉంటుందని చెప్పారు. అజయ్ దేవ్ గన్ – ఆనంద్ పండిట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇలియానా డి క్రజ్ కీలక పాత్రలో నటించారు.

తాజాగా ఈ క్రైమ్-థ్రిల్లర్ నుంచి ఇలియానా డి క్రజ్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో ఇలియానా లుక్ చూస్తుంటే ఫేస్ కాస్త సీరియస్ గా ఏదో థింక్ చేస్తున్నట్టే కనిపిస్తోంది. ఏదో హర్రీ సన్నివేశంలో ఇల్లీ బేబి లాకైందా? అన్న సందేహం కలగక మానదు. బ్యాక్ గ్రౌండ్ లో ఖాళీ అయిపోయిన బ్యాంక్ ఖాతా వివరాలు కనిపిస్తున్నాయి.. అంటే స్టాక్ మార్కెట్ కొంపలంటించిందనే దీనర్థం.

సిల్వర్ ఆక్సిడైజ్డ్ చెవి రింగులతో బ్లాక్ సల్వార్ సూట్ ధరించిన ఇలియానా లుక్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఆ కళ్ళజోడు బన్ లుక్ హెయిర్ స్టైల్ ఇల్లీ రూపాన్ని పూర్తిగా మార్చేసింది. పక్కాగా కార్పొరెట్ ఉద్యోగిలా కనిపిస్తోంది. ఇది హర్షద్ మెహతా కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న థ్రిల్లర్ సినిమా అని ప్రచారం సాగుతున్నా చిత్రబృందం ఎక్కడా లీకులివ్వడం లేదు.

అజయ్ దేవగన్ ఈ పోస్టర్ ను ట్విట్టర్లో పోస్ట్ చేయడం ద్వారా తన ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు. ది బిగ్ బుల్ ప్రపంచంలో మేం భాగమైనందుకు సంతోషిస్తున్నాం. భారతదేశానికి కలలను అమ్మిన వ్యక్తి కథాంశమిది అని వెల్లడించారు.