ప్రభాస్ తెలుగు వారి పరువు నిలబెడతాడా…?

0

భారతీయ సినీ పరిశ్రమలో బాలీవుడ్ తర్వాత రెండవ అతి పెద్ద సినీ ఇండస్ట్రీగా టాలీవుడ్ గుర్తింపు పొందుతోంది. ఒకప్పుడు తెలుగు సినిమాని ప్రాంతీయ చిత్రంగా చూసేవారు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి పొందుతోంది. ఈ నేపథ్యంలో మన టాలీవుడ్ డైరెక్టర్స్ బాలీవుడ్ లో కూడా సినిమాలు డైరెక్ట్ చేస్తూ సక్సెస్ సాధిస్తున్నారు. మన స్టార్ హీరోలు సైతం తమ మార్కెట్ ని విస్తరించుకునే ఉద్దేశ్యంతో ఇతర భాషల్లో కూడా తమ చిత్రాలను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అందరూ పాన్ ఇండియా మూవీస్ తీస్తూ పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని ట్రై చేస్తున్నారు. అయితే వీరిలో ఏ హీరో కూడా డైరెక్ట్ బాలీవుడ్ మూవీలో నటించడం లేదు. ఈ నేపథ్యంలో లేటెస్టుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆది పురుష్’ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

వాస్తవానికి ఇప్పటి సీనియర్ హీరోలు నాగార్జున – చిరంజీవి – వెంకటేష్ లు బాలీవుడ్ లో సత్తా చాటడానికి ట్రై చేసారు. ‘కింగ్’ నాగార్జున హిందీలో ‘శివ’ ‘ఖుదాగవా’ ‘ద్రోహి’ ‘క్రిమినల్’ ‘జక్మ్’ ‘అగ్ని వర్ష’ ‘ఎల్ ఓ సీ కార్గిల్’ చిత్రాల్లో నటించాడు. అయితే నాగ్ 2003 తర్వాత హిందీ సినిమాల్లో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ అనే బాలీవుడ్ సినిమాలో అమితాబ్ – రణబీర్ కపూర్ లతో కలిసి నటిస్తున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి ‘ప్రతిబంధ్’ ‘ఆజ్ కా గుండా రాజ్’ అనే చిత్రాలతో బాలీవుడ్ లో పాగా వేయాలని చూసారు. కానీ అక్కడ క్లిక్ అవలేక పోయాడు. విక్టరీ వెంకటేష్ ‘అనారి’ ‘తఖ్దీర్ వాలా’ వంటి హిందీ సినిమాల్లో నటించారు. ఇక రామ్ చరణ్ ‘జంజీర్’ సినిమా తో తుఫాన్ లా మెరవడానికి ట్రై చేశాడు కానీ తుస్సుమనిపించాడు. ఈ నేపథ్యం లో ఇప్పుడు ప్రభాస్ కూడా బాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు.

కాగా ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నాడు. దీంతో ‘సాహో’ సినిమాని కూడా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసి సక్సెస్ సాధించారు. ఈ క్రమంలో ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ‘రాధే శ్యామ్’ సినిమాని కూడా పలు భారతీయ భాషల్లో విడుదల చేస్తున్నాడు. దీంతో పాటు మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ పాన్ ఇంటర్నేషనల్ ఫిలిం అనౌన్స్ చేసాడు ప్రభాస్. బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకుణే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడు. ఇప్పుడు ప్రభాస్ మరో అడుగు ముందుకేసి డైరెక్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘ఆది పురుష్’ ప్రకటించాడు. ‘తానాజీ’ పేమ్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టీ – సిరీస్ భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ లు కలిసి భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకం గా నిర్మించనున్నారు.

అయితే ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సత్తా చాటి మన తెలుగు హీరోలు వదిలేసిన గ్యాప్ ని ఫిల్ చేస్తాడా? అని టాలీవుడ్ లో అందరూ చర్చించుకుంటున్నారు. ‘ఆది పురుష్’తో సూపర్ సక్సెస్ అందుకొని తెలుగు వారి పరువు నిలబెడతాడా లేదా మిగతా హీరోల వలె కొన్ని సినిమాల్లో నటించి బ్రేక్ తీసుకుంటాడా అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఇక 3 డి ఫార్మాట్ లో విజువల్ వండర్ గా రూపొందించనున్న ‘ఆది పురుష్’ చిత్రాన్ని 2021 లో సెట్స్ పైకి తీసువెళ్లి.. 2022 లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ప్రభాస్ కి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.