హీరోయిన్ కి మరణ భయం!

0

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు దక్కించుకుంది. నెపొటిజంకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న పోరాటం కు కోట్లాది మంది మద్దతు తెలుపుతున్నారు. బాలీవుడ్ లో ఉన్న మాఫియాకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు మరియు ఆమె వారిపై చేస్తున్న పోరాటం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ఆమె మహారాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడిపైనే విమర్శలు చేసింది. బాలీవుడ్ విషయాలతో నీకు సంబంధం ఏంటీ నీవు ఎవరిని అయితే కాపాడాలనుకుంటున్నావో వారు శిక్ష అనుభవించాల్సిందే అంటూ ఇటీవల సీఎం కొడుకునే హెచ్చరించింది.

కంగనాకు రోజు రోజుకు శత్రువులు పెరుగుతున్న నేపథ్యంలో ఆమె ప్రాణాలకు హాని ఉందంటూ ఆమె సన్నిహితులు ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమెను చంపేందుకు కూడా ప్రయత్నించే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు భయపడుతున్నారట. అందుకే కంగనా తల్లి ఇటీవల మృత్యుంజయ హోమాన్ని చేయించిందట. ఈ విషయాన్ని స్వయంగా కంగనా సోషల్ మీడియాలో తెలియజేసింది.

నా తల్లికి నా ప్రాణాల విషయంలో ఆందోళన ఉంది. అందుకే ఆమె నాతో మృత్యుంజయ హోమం చేయించింది. లక్షా పదినేను వేల సార్లు మృత్యుంజయ మంత్రంను జపించారు. అమ్మ కోసం తాను ఈ హోమంలో పాల్గొన్నాను అంటూ ఫొటోలు మరియు వీడియోలను షేర్ చేసింది. బాలీవుడ్ కు చెందిన ప్రముఖులపై ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. అయితే ఎవరు ఆమెను హత్య చేయించే స్థాయిలో సాహసానికి వడికట్టక పోవచ్చు అంటున్నారు. ఈమద్య కొత్త విమర్శలు మొదలు పెట్టింది కనుక ఈ ఆందోళన అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.