Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘రౌడీ హీరో’ పై క్రష్ ఉందంటున్న సీనియర్ హీరోయిన్..!!

‘రౌడీ హీరో’ పై క్రష్ ఉందంటున్న సీనియర్ హీరోయిన్..!!


సౌత్ సీనియర్ యాక్ట్రెస్ కస్తూరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన అన్నమయ్య సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తెలుగులో కస్తూరి అన్నమయ్య సినిమాకి ముందు తర్వాత చాలా సినిమాలే చేసింది. కానీ అన్నమయ్య సినిమాతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గ్లామర్ పాత్రలతో అలరించిన ఈ సీనియర్ భామ.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. సీరియల్ యాక్ట్రెస్ గా రాణిస్తోంది. అయితే తాజాగా కస్తూరి టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఆలీతో సరదాగా’ అనే కార్యక్రమానికి విచ్చేసి తన అనుభవాలను షేర్ చేసింది. ఈ ప్రోగ్రాంలో తన క్రష్ ఎవరెవరి పై ఉందో అందరి పేర్లు బయట పెట్టేసింది. కానీ అప్పట్లో టాలీవుడ్ కింగ్ నాగార్జున అంటే తనకు ఎంతో క్రష్ ఉండేదని చెప్పింది. అన్నమయ్య షూటింగ్ టైంలో నాగార్జున తన చేయి తాకాడని.. ఆ రోజంతా ఆ చేయిని కడగకుండా ఉంచుకుందట.

అలాగే తనకు ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఎంతో ఇష్టమని ధోనితో దిగిన ఫోటోలను చూపిస్తూ ఆనందం వ్యక్తం చేసింది. ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే.. కస్తూరి అమెరికాకు చెందిన ఓ డాక్టరును పెళ్లి చేసుకుందట. ప్రస్తుతం తన భర్త అమెరికాలోనే ఉంటున్నాడని తెలిపింది. ఇక ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి క్యాస్టింగ్ కౌచ్ సమస్యలపై పోరాడుతున్నానని తెలిపింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుత హీరోలలో ఏ హీరోకి తల్లిగా నటిస్తారు? అనే ప్రశ్నకి.. నేను ఏ హీరోకి తల్లిగా చేయను. నేను చేయాలంటే ఆ సినిమాలో హీరోనే డ్యూయెల్ రోల్ చేయాలి. అటు హీరోకి భార్యగా.. ఇటు అదే హీరోకి తల్లిగా చేస్తానని అంటోంది. ఇక యంగ్ హీరో విజయ్ దేవరకొండకు తల్లిగా నటిస్తారా..? అని అడిగితే అసలు ఛాన్సే లేదంటుంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ పై తనకు చాలా క్రష్ ఉందని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కస్తూరి “ఇంటిటి గృహలక్ష్మి” అనే తెలుగు సీరియల్లో నటిస్తోంది.