రెడ్ హాట్ లుక్ తో గుండె కొల్లగొట్టిన జాన్వీ

0

రెగ్యులర్ ఫోటోషూట్లతో హీట్ పెంచాలంటే జాన్వీ కపూర్ తర్వాతనే. కపూర్ వంశంలో సోనమ్ తర్వాత మళ్లీ అంతటి ఫ్యాషనిస్టాగా పాపులరైంది ఈ కుర్రబ్యూటీ. సోనమ్ పెళ్లాడి రిటైర్ మెంట్ తీసుకున్నాక జాన్వీ కపూర్ లైన్ లోకొచ్చింది. ఫ్యాషన్ ప్రపంచపు పోకడల్ని ఒంటపట్టించుకుని కథానాయికగానూ రాణిస్తోంది. ధడక్ సినిమాతో పెద్ద తెర ఆరంగేట్రం చేసిన ఈ అమ్మడు వరుసగా భారీ క్రేజీ చిత్రాలకు కమిటైంది.

ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన `ది కార్గిల్ గర్ల్` విజయవంతమైంది. వైమానిక దళ అధికారిణి.. సాహసి అయిన గుంజన్ సక్సేనా జీవితకథతో రూపొందిన ఈ మూవీ విశేష ఆదరణ అందుకుంటోంది. ఈ సక్సెస్ గ్లో జాన్వీలో ప్రత్యక్షంగానే కనిపిస్తోంది. తాజాగా రెడ్ హాట్ డఫెల్ గౌన్ లో ప్రత్యక్షమై హీట్ పెంచేసింది. ముఖ్యంగా ఆ థై స్లిట్ లుక్ కి యూత్ పరేషాన్ అయిపోతున్నారంతే.

తదుపరి భారీ హిస్టారికల్ మూవీ తఖ్త్ లో జాన్వీ నటించనుంది. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతున్న జాన్వీకి సోషల్ మీడియాల్లో అసాధారణంగా ఫాలోయింగ్ పెరుగుతోంది. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా తనకు అప్పటికే అద్బుత ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసినదే.