అఖిల్ కోసం ‘సైరా’ డైరెక్టర్ తగ్గుతాడా…?

0

అక్కినేని వారసుడు అఖిల్ తన ఫస్ట్ మూవీ ‘అఖిల్’ నుంచి సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని అఖిల్ తన శక్తినంతా ధార పోస్తున్నా గాని సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అఖిల్ నటించిన ‘హలో’ ‘మిస్టర్ మజ్ను’ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టలేకపోయాయి. ఈ క్రమంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ”మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అనే సినిమా పట్టాలెక్కించాడు అఖిల్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ మరియు సాంగ్ ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసాయి. దీంతో ఈ సినిమాకి మంచి బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది.

కాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన సురేందర్ రెడ్డి అఖిల్ తో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ని సురేందర్ రెడ్డి భారీ బడ్జెట్ చిత్రంగా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటి వరకు స్టార్ హీరోలతో సినిమాలు రూపొందిస్తూ వస్తున్న సురేందర్ రెడ్డి అఖిల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకోకుండా బడ్జెట్ లెక్కలు వేసారట. అయితే అఖిల్ సినిమాకి భారీ బడ్జెట్ పెట్టడానికి ప్రొడ్యూసర్స్ ముందుకొస్తారా అనే అనుమానాలు ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో సురేందర్ రెడ్డి తగ్గి లిమిటెడ్ బడ్జెట్ మూవీ తీస్తాడేమో అని అనుకుంటున్నారు. ఎందుకంటే సురేందర్ రెడ్డికి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు.. స్టార్ హీరోలందరూ ఫుల్ బిజీగా ఉన్నారు.. అందువల్ల సురేందర్ రెడ్డి అఖిల్ మూవీని అతని మార్కెట్ రేంజ్ లో చేస్తాడని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.