ఎన్టీఆర్ రెండు నిర్ణయాలు ‘బొమ్మరిల్లు’కు దోహదపడ్డాయి!!

0

సిద్దార్థ.. జెనీలియా జంటగా భాస్కర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘బొమ్మరిల్లు’ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న బడ్జెట్ చిత్రాల్లో భారీ బ్లాక్ బస్టర్ చిత్రంగా బొమ్మరిల్లు నిలిచింది. 2006 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా ఇంకా కూడా ప్రేక్షకుల్లో గుర్తు ఉంది అంటే ఆ సినిమా చూపించిన ప్రభావం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే మొదట ఈ సినిమాను ఎన్టీఆర్ తో దిల్ రాజు చేయాలని కోరుకున్నాడట.

భాస్కర్ కథ చెప్పిన వెంటనే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట. ఎన్టీఆర్ కు ఈ కథ వినిపించిన సమయంలో కూడా ఆయన పాజిటివ్ గా స్పందించాడు. అప్పటికే రెండు సినిమాలు చేస్తున్న కారణంగా కాస్త వెయిటింగ్ లో పెట్టాడట. ఆ తర్వాత సినిమాను చేయలేను అంటూ దిల్ రాజుకు చెప్పాడట. అదే సమయంలో ఈ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ స్టోరీని లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న సిద్దార్థతో చేయిస్తే బాగుంటుందని ఎన్టీఆర్ సలహా ఇచ్చాడట.

ఎన్టీఆర్ బొమ్మరిల్లు విషయంలో తీసుకున్న ఈ రెండు నిర్ణయాలు కూడా ఆ సినిమా గురించి ఇప్పటికి మాట్లాడుకునేలా చేశాయి. ఒక వేళ ఎన్టీఆర్ ఈ చిత్రంలో చేసి ఉంటే ఖచ్చితంగా ఫలితం మరోలా ఉండేదేమో. అప్పటికే మాస్ యాక్షన్ చిత్రాలను చేసి యాక్షన్ హీరోగా వెలుగు వెలుగుతున్న ఎన్టీఆర్ ను బొమ్మరిల్లు సిద్దు పాత్రలో ప్రేక్షకులు ఫ్యాన్స్ చూసేందుకు ఇష్టపడక పోయేవారు. కనుక బొమ్మరిల్లు సినిమాను ఎన్టీఆర్ చేయక పోవడంతో పాటు సిద్దుతో చేయడం మంచిది అంటూ సూచించడంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు.