అల రికార్డుల మోత మ్రోగుతూనే ఉంది

0

ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్న ‘అల వైకుంఠపురంలో’ చిత్రం ఆడియో కూడా సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకుంది. యూట్యూబ్ లో ఈ చిత్రం పాటలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పాటలు అన్ని కలిపి యూట్యూబ్ లో ఇప్పటికే బిలియన్ వ్యూస్ ను క్రాస్ చేశాయి. ఇక ఒక్కో పాట కూడా సరికొత్త నెంబర్ కు చేరుతూ సౌత్ ఇండియాలో మరే పాటలకు సాధ్యం కాని వ్యూస్ ను దక్కించుకుంటున్నాయి.

థమన్ సంగీత సారధ్యంలో వచ్చిన ఈ ఆల్బమ్ లోని ప్రతి పాట యూట్యూబ్ లో వందల కొద్ది మిలియన్ ల వ్యూస్ ను రాబడుతోంది. రాములో రాముల లిరికల్ వీడియో ఏకంగా 300 మిలియన్ లను క్రాస్ చేసింది. ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో మరే హీరోకు సాధ్యం కాని యూట్యూబ్ వ్యూస్ ను బన్నీ ఈ ఆల్బంతో దక్కించుకున్నాడు. ఈమద్య కాలంలో కొత్త సినిమాలు ఏమీ తెరకెక్కడం లేదు. రాబోయే మూడు నాలుగు నెలల వరకు కొత్త సినిమాలు ఉండే అవకాశం లేదు. కనుక మరో మూడు నాలుగు నెలల పాటు ఈ పాటలే తెలుగు శ్రోతలకు దిక్కు.

ఈ రికార్డుల మోత మరింతగా మ్రోగే అవకాశం ఉందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వసూళ్ల పరంగా టాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డులను దక్కించుకున్న ఈ చిత్రం పాటల విషయంలో మాత్రం సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ రికార్డును నమోదు చేసింది. బన్నీ ఈ చిత్రంతో బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అందుకే ఆయన పుష్ప చిత్రంతో అక్కడకు కూడా వెళ్లబోతున్నాడు.