లాక్ డౌన్ లో కథానాయికల పాట్లు ఫీట్లు చూసారా

0

లాక్ డౌన్ పరిశ్రమకే కాదు.. అందరికీ పాఠాలు నేర్పించింది. ఈ పాఠాల్లో ముఖ్యమైన పాఠం ఫిట్ నెస్. మహమ్మారీ తరుముకొచ్చినా ఎలాంటి అదురు బెదురు లేకుండా ఉండాలంటే మానసిక శారీరక ఆరోగ్యం చాలా చాలా ఇంపార్టెంట్. దానికి యోగా- ఎక్సర్ సైజులు సహా ధ్యానం ఎంతో ముఖ్యం.

కథానాయికలలో లాక్ డౌన్ ని సద్వినియోగం చేసుకున్న నాయికల జాబితాని పరిశీలిస్తే.. సమంత-రకుల్ ప్రీత్- తాప్సీ- పూజా హెగ్డే- కత్రిన- అదాశర్మ లాంటి భామల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ లో గార్డెనింగ్ తో పాటు యోగాను బాగా ఆస్వాదిస్తున్నానని సమంత తెలిపారు. ఇక రూఫ్ టాప్ గార్డెనింగ్ లో సమంత అనుభవం గురించి వంటగదిలో వంటకాల ప్రయోగం గురించి తెలిసినదే. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక ఫిట్ నెస్ విషయంలో సామ్ అస్సలు రాజీకి రాలేదు. యోగాసనాల్లో అతి క్లిష్టమైన మయూరాసనం ఈ లాక్ డౌన్ లో ప్రాక్టీస్ చేశారు సామ్.

పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ విషయంలో ఎంత శ్రద్ధ కనబరుస్తుందో తెలిసిందే. యోగా జిమ్ తో నిరంతరం గంట పైగా కుస్తీ పడుతుంది రకుల్. ఇప్పటికే ఫిట్ నెస్ జిమ్ ల నిర్వహణ ప్రమోషన్స్ లో పూర్తి అనుభవం ఘడించిన రకుల్ కి ఆరోగ్యం అందంపై శ్రద్ధ అంతా ఇంతా కాదు. లాక్ డౌన్ వర్కవుట్లు ఇప్పటికే వెబ్ లో వైరల్ అయ్యాయి.

యోగాపై రకుల్ మాట్లాడుతూ ఇది కేవలం శరీరానికి సంబంధించింది కాదు మనసుకు సంబంధించినది.. మన జీవిత విధానానికి సంబంధించిన విషయం. అందుకే వర్కౌట్లో క్రమం తప్పేది లేదు అంటూ మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా తెలిపింది.

అలాగే లాక్ డౌన్ సీజన్ లో ధనురాసనం నేర్చేసుకున్నానంటూ చెప్పింది బుట్టబొమ్మ పూజా హెగ్డే. 2020 ఆరంభమే అల వైకుంఠపురములో రూపంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకుని అదే జోష్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. యోగా చేస్తే తెలియని సంతోషం!! అంటోంది పూజ.

ఇంట్లో వీలయ్యే వర్కౌట్స్ చేయండి.. నేను చేస్తున్నా అంటూ రాశీ ఖన్నాటెంప్ట్ చేస్తోంది. రాశీ జిమ్ వర్కవుట్లకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికే హీట్ పెంచేశాయి. అదా శర్మ- తాప్సీ తదితరులు కూడా వర్కౌట్స్తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ ఇద్దరూ గత ఐదారేళ్లుగా రెగ్యులర్ వర్కవుట్లతో ఫిట్ నెస్ ఫ్రీక్స్ గా పాపులరయ్యారు. అదా శర్మ జిమ్ యోగాతో పాటు డ్యాన్సులతోనూ పిట్ నెస్ మంత్రం జపిస్తుందన్న సంగతి తెలిసినదే. ఇక కత్రిన.. కరీనా లాంటి సీనియర్ బ్యూటీస్ ఫిట్ నెస్ విషయంలో యోగాను నిరంతర సాధనంగా మార్చుకున్నారు.