షాకింగ్ విషయం రివీల్ చేసిన కాజల్

0

చందమామ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నాలుగు రోజుల క్రితం గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుని వైవాహిక జీవితంలో అడుగు పెట్టేసింది. ఆమె కొత్త సంసార జీవితం సంతోషంగా ఉండాలంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆమెకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేసింది. కాజల్ తన భర్త గౌతమ్ గురించిన విషయాలను తాజాగా షేర్ చేసుకుంది.

తాము ఇద్దరం ఈమద్య కలుసుకుని ప్రేమించుకోవడం జరగలేదని మాది పదేళ్ల సంవత్సరాల స్నేహం ప్రేమ అంటూ సీక్రెట్ ను రివీల్ చేసింది. అప్పట్లోనే కాజల్ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆ సమయంలో ఆమె స్పందించక పోవడంతో అంతా లైట్ తీసుకున్నారు. అంటే అప్పట్లో వచ్చిన వార్తలు నిజమే అన్నమాట.

పది సంవత్సరాలుగా మా మద్య అప్యాయత అనురాగం కొనసాగుతుంది. ఇద్దరం ఒకరిని ఒకరం అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలని సరైన సమయంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా కరోనా సమయంలో మేమిద్దరం మరింత దగ్గర అయ్యాం అంటూ కాజల్ చెప్పుకొచ్చింది. మూడేళ్ల డేటింగ్ ఏడేళ్ల స్నేహం ను ఇలా పెళ్లిగా మార్చకున్నట్లుగా కాజల్ పేర్కొంది.

మా ఇద్దరి మద్య ప్రేమ ప్రపోజల్ సినిమాటిక్ గా ఏమీ జరగలేదు. గౌతమ్ మాటల్లో తన జీవితంలో నాకు ఎంత ప్రాముఖ్యత ఉందో చెప్పాడు. అప్పుడే నాకు ఆయన వల్ల జీవితాంతం సంతోషం స్వేచ్చ ఉంటుందని అనిపించింది. అలా మా ఇద్దరి మద్య ప్రేమ చిగురించింది. ఇద్దరిని ఒకరిని ఒకరం ప్రేమించుకున్నాం. ఈ ఏడాది ఏప్రిల్ లో మా కుటుంబాలకు ఈ విషయాన్ని తెలియజేశాం. పెళ్లికి రెండు కుటుంబాలు ఒప్పుకున్నాయి.

మా ఇద్దరి నిశ్చితార్థం జూన్ లో జరిగింది. అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల మద్య లాక్ డౌన్ టైమ్ లో నిశ్చితార్థం చేసుకున్నాం. నా నిశ్చితార్థం కోసం మనీష్ మల్హోత్ర లాక్ డౌన్ టైమ్ లో తన స్టోర్ ను ఓపెన్ చేశారు. నా కోసం డ్రస్ డిజైన్ చేశారు. నా పెళ్లిని డెస్టినేషన్ మ్యారేజ్ గా ప్లాన్ చేశాం. కాని జీవితంలో పెళ్లి ముఖ్యమే కాని ఈ సమయంలో అలాంటి పెళ్లి ముఖ్యం కాదు అనిపించిందని కాజల్ పేర్కొంది.

పెళ్లికి దగ్గరి వారిని ఆప్తులను పిలవలేక పోయినందుకు బాధగా ఉంది. సినిమా పరిశ్రమ వారి కోసం వచ్చే ఏడాది పార్టీని ఇవ్వబోతున్నట్లుగా కాజల్ పేర్కొంది. ప్రేమలో ఉన్నంత మాత్రాన బయటకు చెప్పి హడావుడి చేయాల్సిన అవసరం లేదు అంటూ ప్రస్తుతం ప్రేమలో ఉన్న వారికి తన సలహాగా కాజల్ చెప్పుకొచ్చింది.