Templates by BIGtheme NET
Home >> Cinema News >> మాల్దీవుల్లో హనీమూన్ మర్చిపోలేకపోతున్న కాజల్

మాల్దీవుల్లో హనీమూన్ మర్చిపోలేకపోతున్న కాజల్


బిజినెస్ మేన్ కం ఫ్రెండు గౌతమ్ కిచ్లుతో కాజల్ సడెన్ పెళ్లి అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఏడాది కాలంగా బిజినెస్ మేన్ తో ప్రేమాయణం సాగిస్తోందని కలిసిమెలిసి షికార్లు చేస్తోందని ప్రచారం ఉన్నా కానీ ఏనాడూ కాజల్ బయటపడిందేమీ లేదు. దీంతో సడెన్ గా పెళ్లి అంటూ ప్రకటించడంతో సడెన్ షాక్ కి గురయ్యారు అభిమానులు.

పెళ్లి అని ప్రకటించిన అనంతరం ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా ఫిక్స్ చేసిన ముహూర్తానికి వివాహం జరిగింది. కాజల్ లైఫ్ లో ఎంతో ఎగ్జయిటింగ్ మూవ్ మెంట్ అది. అనంతరం మాల్దీవుల్లో అండర్ వాటర్ హనీమూన్ గురించి తెలిసినదే. కాజల్ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని క్షణాలు మాల్దీవుల్లోనే అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ విహారానికి సంబంధించిన ప్రతి ఫోటో వీడియో అభిమానుల్లో వైరల్ అయ్యాయి.

ఇప్పటికే ఈ విహారం ముగించి తిరిగి ఆచార్య సెట్స్ లోకి కాజల్ జాయిన్ అయిన సంగతి తెలిసిందే. మొన్ననే హబ్బీ గౌతమ్ కిచ్లు `ఆచార్య` సెట్స్ లో ప్రత్యక్షమై సర్ ప్రైజ్ చేశారు. ఆ ఇద్దరికీ పూలదండలు మార్చి సెట్లోనే మెగాస్టార్ సమక్షంలో చాలా సందడి చేసింది చిత్రబృందం. ఇప్పుడు మరోసారి మాల్దీవుల విహారంలోని ఓ అరుదైన ఫోటోని కాజల్ షేర్ చేయగానే అది కాస్తా అంతర్జాలంలోకి వైరల్ గా దూసుకెళుతోంది. పింక్ ఫార్మల్ డ్రెస్ లో కాజల్ సముద్ర తీరంలో నిలుచుని ఇదిగో ఇలా అందంగా ఫోజిచ్చింది. ఆ పక్కనే హ్యాండ్ బ్యాగ్ కూడా ఈ ఫోటోలో కవర్ అయ్యింది మరి. స్టన్నింగ్ ఫోజులో చందమామ! అంటూ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.